AP Govt Jobs : ఏపీలో 175 ఉద్యోగాలకి నోటిఫికేష‌న్ .. నెల‌కి రూ.60 వేల జీతం..!

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Updated on: May 4, 2025, 6:48 pm
  •  AP Govt Jobs : ఏపీలో 175 ఉద్యోగాలకి నోటిఫికేష‌న్ ..నెల‌కి రూ.60 వేల జీతం..!

AP Govt Jobs  : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రణాళికా శాఖలో ఖాళీగా ఉన్న 175 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో 175 యంగ్ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్, అలాగే ప్రభుత్వ P4 కార్యక్రమ సమన్వయానికి.. కాంట్రాక్ట్ పద్ధతిలో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

AP Govt Jobs : ఏపీలో 175 ఉద్యోగాలకి నోటిఫికేష‌న్ .. నెల‌కి రూ.60 వేల జీతం..!

AP Govt Jobs : ఏపీలో 175 ఉద్యోగాలకి నోటిఫికేష‌న్ .. నెల‌కి రూ.60 వేల జీతం..!

AP Govt Jobs  గుడ్ న్యూస్..

అభ్యర్థుల పనితీరు, అవసరాల ఆధారంగా ఈ కాంట్రాక్టు కాలాన్ని భవిష్యత్తులో పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఈ యంగ్ ప్రొఫెషనల్స్ పనిచేయాల్సి ఉంటుంది.ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీఏ లేదా ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) డిగ్రీని కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 60,000 చొప్పున వేతనం చెల్లించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. వయోపరిమితి విషయానికొస్తే, 2025 మే 1వ తేదీ నాటికి అభ్యర్థి వయసు 40 ఏళ్లు మించకూడదని పేర్కొన్నారు.

అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ విధానంలో మే 13వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూలను ప్రామాణికంగా తీసుకుంటారని ప్రభుత్వం తెలిపింది. ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, ఎంపిక విధానం, వేతనం తదితర పూర్తి వివరాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన https://apsdpscareers.com/YP.aspx వెబ్ పోర్టల్‌ను సంప్రదించాలి.

Ramalingaiah Tandu

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp