ECIL Jobs : తెలంగాణ విద్యుత్ శాఖలో భారీ ఉద్యోగాలు…లక్షకు పైగా జీతం…!
ప్రధానాంశాలు:
ECIL Jobs : తెలంగాణ విద్యుత్ శాఖలో భారీ ఉద్యోగాలు...లక్షకు పైగా జీతం...
ECIL Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL నుండి ఉద్యోగాల భర్తీకి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సమాచారం . మరి ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
ECIL Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…
మనకు ఈ భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL నుండి విడుదల కావడం జరిగింది.
ECIL Jobs : ఖాళీలు…
ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైని ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ECIL Jobs : విద్యార్హత..
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
ECIL Jobs : వయస్సు…
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారి వయసు 13 -04-2024 నాటికి గరిష్టంగా 27 సంవత్సరాలు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే అర్హులు కారు.
అలాగే ప్రభుత్వం నిబంధనల ప్రకారం SC,STలకు 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
జీతం…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ముందుగా ట్రైనీ ఆఫీసర్లుగా ట్రైనింగ్ ఇస్తారు. ఇక ఈ ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ ఇస్తారు. పోస్ట్ ఇచ్చిన తర్వాత రూ.40,000 నుండి రూ.1,40,000 వరకు జీతం గా ఇస్తారు.
రుసుము…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇక ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు. ఇక ఈ ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి ఉద్యోగం ఇవ్వబడుతుంది.
ఎలా అప్లై చేయాలి…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత ఆఫీసీయల్ వెబ్ సైట్లోకి వెళ్లి పూర్తి వివరాలు నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు…
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు 25-05-
2024 లోపు అప్లై చేసుకోగలరు.