Flipkart : భారతదేశంలోని స్వదేశీ ఇ-కామర్స్ మార్కెట్ ప్లేస్ అయిన ఫ్లిప్‌కార్ట్ తన 5-సంవత్సరాల ప్రయాణ మైలురాయిని భారతదేశంలోని కళాకారులు, చేనేత కార్మికులు, స్వయం సహాయక సంఘాలు, మహిళలు & గ్రామీణ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించే కార్యక్రమం ద్వారా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో 250 మంది పరిశ్రమల ప్రముఖులు, విక్రేతలు, చేతివృత్తులవారు, చేనేత కార్మికులు, హస్తకళాకారులు మరియు స్వయం సహాయక సంఘాలు పాల్గొన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ యొక్క సప్లై చైన్ ఆపరేషన్స్ అకాడమీ (SCOA) భారతదేశం అంతటా ఉపాధి పొందగల వేలాది మంది యువతకు నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో సమర్థ్ ఈవెంట్‌లో నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (MSDE)తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) 4.0 కింద ఈ భాగస్వామ్యం భారతదేశం అంతటా వేలాది మంది యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడం, ఇ-కామర్స్ మరియు సప్లై చైన్ రంగాలలో వారికి ఉపాధిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్లిప్‌కార్ట్ బృందం అభ్యర్థులకు 7-రోజుల ఇంటెన్సివ్ క్లాస్‌రూమ్ శిక్షణతో పాటు 45 రోజుల పాటు ఫ్లిప్‌కార్ట్ సౌకర్యాల వద్ద హ్యాండ్-ఆన్ ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్‌తో సంపూర్ణ అనుభవం మరియు శిక్షణను అందిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ రజనీష్ కుమార్ మాట్లాడుతూ.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా సుస్థిరమైన జీవనోపాధిని సృష్టిస్తూ భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించే మరియు ప్రోత్సహించే విధంగా తాము పని చేస్తున్నట్లు చెప్పారు. తమ సమర్థ్ చొరవ ద్వారా గత 5 సంవత్సరాలలో 1.8 మిలియన్ల మంది జీవనోపాధిని సానుకూలంగా ప్రభావితం చేసినట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖతో తమ భాగస్వామ్యం డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలతో భారతదేశ యువతను మరింత సన్నద్ధం చేస్తుందని పేర్కొన్నారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.