Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోగా ఆయనకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.ఆయన గత కొద్ది రోజులుగా రాజమౌళి సినిమా కోసం కృషి చేస్తున్నారు. మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు మేకోవర్‌పై కూడా వర్క్‌షాప్స్ జరుగుతున్నాయి. ఇంతలో ఓ ఇంట్రస్టింగ్ వార్త సినిమా ఇండస్ట్రీతోపాటు మహేష్‌బాబు ఫ్యాన్స్‌లో కూడా ఆసక్తిని పెంచుతోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ సినిమాకు టైటిల్ కూడా పెట్టేశారు.
చిత్రానికి పని చేస్తున్న విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది . ఆయన బంగారు గరుడ రెక్కలను పోస్ట్ చేశారు. ఎస్ఎస్ఎంబి 29 అనే ట్యాగ్ జోడించాడు. అసలు గరుడ రెక్కలకు ఎస్ఎస్ఎంబి 29 చిత్రానికి సంబంధం ఏమిటనే సందేహాలు మొదలయ్యాయి. రాజమౌళి-మహేష్ బాబు మూవీ టైటిల్ గరుడ అనే ప్రచారం ఊపందుకుంది. గతంలో మహేష్ బాబు గరుడ పేరుతో ఒక ప్రాజెక్ట్ చేసే ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు. అది ఇదేనా అనుమానం కలుగుతుంది. మొత్తంగా విజయన్ సోషల్ మీడియా పోస్ట్ తెలుగు ప్రేక్షకులను అయోమయంలో పడేసింది.
మహేష్‌బాబు కూడా సినిమాకు తగ్గట్టుగానే తన స్టైల్ మొత్తం మార్చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ కనిపించినా లాంగ్‌హెయిర్‌తో కనిపిస్తున్నాడు. ఇటు రాజమౌళి కానీ, అటు మహేష్‌బాబు కానీ ఈ సినిమాకు రిలేటెడ్‌గా ఏం మాట్లాడటం లేదు. సైలెంట్‌గా ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా ఏదైనా అనౌన్స్‌మెంట్ ఉంటుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ ఎస్ఎస్ఎంబీ29 టీం వారిని పూర్తిగా నిరాశపరిచింది. హాలీవుడ్ సెక్స్ ఫుల్ ఫ్రాంచైజ్ ఇండియానా జోన్స్ తరహాలో ఈ మూవీ ఉంటుందని రాజమౌళి స్వయంగా చెప్పాడు. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా మహేష్ బాబు కనిపిస్తారట.
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
This website uses cookies.