Job : ఆరు నెలల శిక్షణతో నెలకు రూ.లక్షా 40 వేల జీతం పొందే గొప్ప అవకాశం. అది కూడా జపాన్ దేశంలో. ప్రభుత్వమే శిక్షణ అందించి జాబ్ అవకాశం కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ, నావిస్ హెచ్.ఆర్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగనున్నది. ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ చదివిన వారికి జపనీస్ భాష నేర్పించి, వారికి జపాన్ దేశంలో నర్సులుగా ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.గుణశేఖర్ రెడ్డి తెలిపారు.
అభ్యర్థులు జపాన్ దేశంలో పనిచేయడానికి ఆసక్తి కలిగి ఉండాలన్నారు. 32 సంవత్సరాలు లోపు వయసు వారు అర్హులన్నారు. శిక్షణ 6 నెలలు ఉంటుందని, నావిస్ హెచ్ఐర్ బెంగళూరులో శిక్షణ కొనసాగుతుందని వివరించారు. శిక్షణ ఫీజు రూ.3,50,000 వేలు. అయితే పాక్షిక శిక్షణ రుసుం రూ.50 వేలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ రూ.25 వేలు చెల్లిస్తుందని మిగిలిన రూ.25 వేలు అభ్యర్థి చెల్లించాల్సి ఉంటుందన్నారు. మిగిలిన రూ.3 లక్షలు మూడు విడతలుగా అభ్యర్థి చెల్లించాల్సిందిగా వెల్లడించారు.
శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జపాన్ దేశం నందు ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు వారిని ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నావిస్ హెచ్ఎర్ పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఉద్యోగం పొందిన అభ్యర్థి నెలకు రూ.1,10,000 నుంచి 1.40,000 వరకు జీతం పొందనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://shorturl.at/FB7ok నమోదు చేసుకోవాలన్నారు. వివరాలు కొరకు 9381109098, టోల్ ఫ్రీ నెంబర్ 99888 53335 నబర్ ను సంప్రదించాలని పేర్కొన్నారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.