AP Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి..!
ప్రధానాంశాలు:
AP Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఈ శుభవార్తను ప్రభుత్వం ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఉన్న టీడీపీ – జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసి నిరుద్యోగులకు నూతన ఆశల్ని రేకెత్తించారు. మొత్తం 16,347 టీచర్ ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేయగా, ఆన్‌లైన్ దరఖాస్తులు https://cse.ap.gov.in మరియు https://apdsc.apcfss.in వెబ్‌సైట్ల ద్వారా ప్రారంభమయ్యాయి.

AP Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి..!
AP Mega DSC ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..ఎన్ని ఖాళీ పోస్టులంటే
దరఖాస్తు ప్రక్రియ మూడు ముఖ్యమైన సెక్షన్లుగా విభజించబడింది. మొదటగా అభ్యర్థులు యూజర్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. దాని కోసం మొబైల్ నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, వచ్చిన యూజర్ ఐడీ మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి ప్రొఫైల్ డిటెయిల్స్ నింపాలి. ఇందులో వ్యక్తిగత వివరాలు, ఫోటో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి. రెండో సెక్షన్‌లో విద్యార్హతలు, చదివిన జిల్లాలు, APTET అర్హత వంటి అన్ని అకడమిక్ వివరాలను పొందుపరచాలి. అదనపు అర్హతలు ఉంటే అవి కూడా స్పష్టంగా పేర్కొనాలి. వివరాలు పూర్తిగా నింపిన తరువాత, ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
తృతీయ సెక్షన్‌లో అభ్యర్థులు తమకు ఇష్టమైన జిల్లా, జోన్ ఎంపిక చేసుకోవచ్చు. అలాగే పరీక్షా కేంద్రాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండు పోస్టులకు అప్లై చేయాలంటే రూ.1,500 ఫీజు చెల్లించాలి. చివరగా, అభ్యర్థులు అందజేసిన వివరాలను ధృవీకరించుకొని ఫైనల్‌గా సబ్మిట్ చేయాలి. ఈసారి మెగా డీఎస్సీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, ప్రామాణికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ మెగా నోటిఫికేషన్‌తో రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉంది.