Sainik School Recruitment 2026 : గూడ్‌న్యూస్‌ .. 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో వార్డెన్ .. ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్

 Authored By suma | The Telugu News | Updated on :8 February 2026,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Sainik School Recruitment 2026 : గూడ్‌న్యూస్‌ .. 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో వార్డెన్ .. ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్

Sainik School Recruitment 2026 : ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికీ ఇది నిజంగా మంచి శుభవార్త. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సైనిక్ స్కూల్ తిలయ్యలో వార్డు బాయ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నియామకాలు జరుగుతాయి. ముఖ్యంగా 10వ తరగతి ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం. ఉద్యోగంతో పాటు ఉచిత వసతి, భోజనం కూడా అందిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Ward Boy Jobs in Sainik School Thilaiya

Sainik School Recruitment 2026 : గూడ్‌న్యూస్‌ .. 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో వార్డెన్ .. ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్

Sainik School Recruitment 2026 : ఉద్యోగ వివరాలు, ఖాళీలు..

ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 03 వార్డు బాయ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇవి SC, OBC, UR కేటగిరీలకు కేటాయించబడ్డాయి.
సంస్థ పేరు: సైనిక్ స్కూల్ తిలయ్య (సైనిక్ స్కూల్స్ సొసైటీ – రక్షణ మంత్రిత్వ శాఖ)
పోస్ట్ పేరు: వార్డు బాయ్
మొత్తం ఖాళీలు: 03
రిక్రూట్‌మెంట్ విధానం: కాంట్రాక్టు ప్రాతిపదికన
నెల జీతం: ₹19,900/- నుండి ₹63,200/- వరకు
ఉద్యోగ ప్రదేశం: సైనిక్ స్కూల్ తిలయ్య
ఈ ఉద్యోగంలో ఎంపికైన వారికి విద్యార్థుల హాస్టల్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పిల్లలతో వ్యవహరించే సామర్థ్యం, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరం.

Sainik School Recruitment 2026 : అర్హతలు .. వయోపరిమితి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.
విద్య అర్హత: 10th పాస్ (డిగ్రీ ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు)
అదనపు నైపుణ్యాలు:
ఇంగ్లీష్‌లో మాట్లాడగలగడం
కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానం
హాస్టల్ లేదా పిల్లలతో పనిచేసిన అనుభవం
శారీరక దృఢత్వం
వయోపరిమితి: 01 జనవరి 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 50 సంవత్సరాలు ఉండాలి

Sainik School Recruitment 2026 : దరఖాస్తు విధానం .. ముఖ్యమైన తేదీలు..

అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫార్మాట్‌ను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 06 ఫిబ్రవరి 2026
చివరి తేదీ: 16 ఫిబ్రవరి 2026
వెబ్‌సైట్: www.sainikschooltilaiya.org
దరఖాస్తు రుసుము:
జనరల్ అభ్యర్థులకు ₹400/-
SC/ST అభ్యర్థులకు ₹250/-

కాగా,  డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఫీజు చెల్లించి అవసరమైన డాక్యుమెంట్ల స్వీయ-ధృవీకరించిన కాపీలతో పాటు దరఖాస్తును ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్ తిలయ్యకు పంపాలి.
ఎంపిక విధానం: ఈ నియామకంలో రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తక్కువ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలో ఉద్యోగం పొందాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఆసక్తి ఉన్నవారు చివరి తేదీకి ముందు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోండి. శుభాకాంక్షలు!

suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి