Home » Andhra Pradesh » Couple Brutally Murdered By Son In Kadapa
andhra pradesh

అత్యంత కిరాతకం.. సొంత పెద్దనాన్న పెద్దమ్మను హత్య చేసిన యువకుడు

Authored By
praveen T
The Telugu News | Published on: September 3, 2021, 4:10 pm
Advertisement

ఇటీవల కాలంలో హత్యలు బాగా పెరిగిపోతున్నాయి. కాగా కడప జిల్లా కొత్త బసాపురంలో అత్యంత కిరాతకమైన హత్య శుక్రవారం వెలుగు చూసింది. మతిస్థిమితం కోల్పోయిన ఓ యువకుడు సొంత వారినే హతమార్చాడు. వివరాల్లోకెళితే.. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని కొత్త బసాపురం గ్రామంలో తొరి వేముల నాగయ్య – నాగమ్మ దంపతులు జీవనం సాగిస్తున్నారు. చాపాడు మండలం నాగులపల్లె విలేజ్‌లో నాగమ్మ చెల్లె ఉండగా, ఆమెకు కొడుకు ఉన్నాడు. కొద్ది రోజులుగా అతడి మెంటల్ కండిషన్ బాగాలేకపోవడంతో అతడిని ట్రీట్‌మెంట్ నిమిత్తం కొత్తబసాపురానికి పంపారు.

Advertisement

పెద్దమ్మ వద్ద ఉన్న సదరు యువకుడు రెండు రోజుల నుంచి బాగానే ఉన్నాడు. కానీ, గురువారం అర్ధరాత్రి సమయంలో వీరయ్య దంపతులను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. చేరదీసిన పెద్ద‌మ్మ‌, పెద్ద‌నాన్నను హ‌త్య‌ చేసిన సదరు యువకుడు హత్య చేసిన ప్ర‌దేశంలోనే దాక్కొని ఉండటం గమనార్హం. నిద్రిస్తున్న ఇద్దరు నాగయ్య-నాగమ్మపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీసినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు పోలీసులు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు అయిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి