Home » Entertainment » Keerthy Suresh Showers Love On Nyke
Entertainment

Keerthy Suresh : నా బిడ్డకు మూడేళ్లు నిండాయ్.. కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: September 3, 2021 12:32 pm
Advertisement

మహానటి కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఎంత బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే అభిమానులకు నైక్ గురించి తెలిసే ఉంటుంది. కీర్తి ఎక్కడకు వెళ్లినా సరే ఆమె వెంట తన పెట్ నైక్ ఉంటుంది. ఇక షూటింగ్ల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు తన బిడ్డ నైక్‌ను కీర్తి మిస్ అవుతుంటుంది. దాని కోసంబెంగ పెట్టుకుంటూ ఉంటుంది. అలా కీర్తి సురేష్ మూగజీవిపై చూపించే ప్రేమకు అభిమానులు ఫిదా అవుతుంటారు. తాజాగా ఆ పెట్‌కు మూడేళ్లు నిండాయట. ఈ మేరకు కీర్తి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Advertisement

Keerthy Suresh Showers Love On Nyke

నా బిడ్డకు మూడేళ్లు నిండాయ్.. కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్ Keerthy Suresh

‘నా కొడుక్కి మూడేళ్లు నిండాయ్.. మన కంటే ఎక్కువగా ప్రేమించేవి ఏదైనా ఉన్నాయా? అంటే వాటిని కుక్కలు అంటారు.. కానీ నువ్ నాకు లైఫ్‌లోకి వచ్చి మూడేళ్లు అవుతున్నాయి.. ఆ విషయం నేను కచ్చితంగా నమ్ముతున్నాను.

Advertisement

Keerthy Suresh Showers Love On Nyke

నీ చిట్టి గుండెలో నేను ఊహించలేనంతా ప్రేమ ఉంది.. దాన్ని చూసి ఎవ్వరైనా సరే నీ మాయలో పడిపోతారు. నైకు నువ్ పుట్టి అప్పుడే మూడేళ్లు నిండిపోయాయ్ అంటే నమ్మలేకపోతోన్నా. నా దృష్టిలో అయితే నువ్ ఇంకా చిన్న పిల్లవే.నిన్ను మొదటగా చూసినప్పుడు ఎలా కనిపించావో.. అలానే అనిపిస్తున్నావ్. నా కష్టసుఖాల్లో నువ్ తోడుగా ఉండి ఎంతటి ప్రేమను పంచావో.. మాటల్లో చెప్పలేను.

Advertisement

Keerthy Suresh Showers Love On Nyke

నీపై నాకు ఎంత ప్రేముందో మాటల్లో చెప్పలేకపోతోన్నాను. నైక్ నువ్వంటే నాకు ప్రాణం. హ్యాపీ బర్త్ డే. నీకు ఈ ఏడాది ఇంకా ఎన్నో సర్ ప్రైజ్‌‌లు, ప్రేమను ఇస్తాను’ అంటూ కీర్తి సురేష్ ఎమోషనల్ అయింది. కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి