కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇక అయిపోయింది అనుకునే లోపు ఈ వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. థర్డ్ వేవ్ త్వరలో రాబోతున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతీ ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని అంటున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సోమవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ప్రతీ ఒక్కరు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. వ్యాక్సిన్ రెండు డోసులు కంపల్సరీగా తీసుకోవాలని తెలిపారు.
ఈ అవగాహనా కార్యక్రమంలో షీ టీం ఏఎస్ఐ విజయమణి, కళా బృందం ఇన్‌చార్జి రామంచ తిరుపతి, కళా బృందం సభ్యులు పాల్గొన్నారు. పోలీసులు కొవిడ్ నేపథ్యంలో ఇలా అవగాహన కల్పించడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా జాగ్రత్తలు తప్పకుండా పాటిస్తామని అంటున్నారు. ఇకపోతే కొవిడ్ నివారణకుగాను గతంలోనూ కళాబృందం ఆధ్వర్యంలో పోలీసులు, కళా బృందం సభ్యులు పలు కార్యక్రమాలు నిర్వహించారు.
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
This website uses cookies.