Home » Andhra Pradesh » Bank Officers Forgot The Atm Machine Keys
andhra pradesh

Kurnool..దొంగల చేతికి తాళాలివ్వబోయిన అధికారులు..!

Authored By
praveen T
The Telugu News | Published on: September 7, 2021, 10:18 pm
Advertisement

జిల్లాలోని డోన్ టౌన్‌లో బ్యాంకు అధికారులు దొంగ చేతికే తాళమివ్వబోయారు. ఈ ఘటన మంగళవారం స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకెళితే.. ఇటీవల పట్టణంలో ఎస్‌బీఐ ఏటీఎంను దొంగలు కొల్లగొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా మరో ఘటన అటువంటిది జరిగింది. డోన్ టౌన్‌లోని రాజ్‌ థియేటర్‌ సమీపంలోని సిండికేట్‌ బ్యాంక్‌ అధికారులు సోమవారం మధ్యాహ్నం డాక్టర్‌ పోచా ప్రభాకర్‌రెడ్డి క్లినిక్‌ ఎదురుగా ఉన్న సిండికేట్‌ ఏటీఎంలో డబ్బులు వేశారు.

Advertisement

అనంతరం ఏటీఎం క్లోజ్ చేసి వెళ్లిపోయారు. అయితే ఏటీఎం మిషన్‌కు సంబంధించిన కీస్ మాత్రం అక్కడే మరిచిపోయారు. మంగళవారం డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తి తాళాలు గుర్తించి బ్యాంక్‌ అధికారులకు సమాచారమిచ్చి అప్పగించాడు. ఒక వేళ దొంగల చేతికి కనుక ఆ తాళాలు చిక్కి ఉంటే అంతే సంగతులు.. స్థానికంగా మరో చోరీ జరిగి ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. బ్యాంకు అధికారులు అలా ఎలా తాళాలు మరిచిపోయారని అందరూ అనుకుంటున్నారు.

Advertisement

 

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి