Home » Mahabubnagar » Mla Visit To Activist Family
mahabubnagar

Mahaboobnagar..నర్సింహులు కుటుంబాన్ని ఆదుకుంటాం: ఎమ్మెల్యే ఆల

Authored By
praveen T
The Telugu News | Published on: September 7, 2021, 6:01 pm
Advertisement

కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని దేవరకద్ర శాసన సభ్యుడు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని మూసాపేట మండల పోల్కంపల్లి సమీపంలోని గాజులపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నర్సింహులు రెండు వారాల కిందట హార్ట్ అటాక్‌తో చనిపోయారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బాధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితుడి కుటుంబీకులకు రూ.20 వేల సాయం అందజేశారు. నర్సింహులు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement

నర్సింహులు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే భరోసానిచ్చారు. నర్సింహులు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆల హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి వెంట స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇకపోతే ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు వంద మంది సీఆర్పీఎప్ జవాన్లు సైకిల్ యాత్ర చేస్తుండగా సోమవారం వారు దేవరకద్రలోని కొత్తకోటకు చేరుకోగా వారికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి స్వాగతం పలికారు. యువత ఆధ్వర్యంలో వారితో కలిసి కొద్ది దూరం సైకిల్ యాత్ర చేశారు.

Advertisement

 

 

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి