Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. ఒకప్పుడు బంగారం కొనడానికి పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు కానీ.. నేడు ఒక తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అయితే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి ప్రజలు అయితే బంగారం వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినట్టుగా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా కూడా ఏదో తక్కువగా తగ్గి ఎక్కువగా ధరలు పెరుగుతున్నాయి. మొన్న బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు పెరిగాయి. నిన్న బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు పెరిగాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4640 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.33 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.46,400 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.330 తగ్గింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు రూ.5062 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.36 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.50,620 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.360 తగ్గింది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,010 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,680 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.56.40 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 60 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.564 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.6 తగ్గింది. కిలో వెండి ధర రూ.56,400 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.600 తగ్గింది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.618 కాగా, కిలో వెండి ధర రూ.61800 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.564 కాగా, కిలో వెండి ధర రూ.56400 గా ఉంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.