April : ఏప్రిల్-1.. పెరగనున్న ధరలు.. కస్టమర్ల జేబులకు చిల్లు..!
April : ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కొన్ని మార్పులు అనేవి కామన్ గానే ఉంటాయి. ఇప్పుడు కూడా కొత్త ఆర్థిక సంవత్సరం రెండు రోజుల్లో స్టార్ట్ కాబోతోంది. అయితే ఈ ఏప్రిల్-1 మాత్రం మామూలుగా అయితే ఉండేలా కనిపించట్లేదు. గతంతో పోలిస్తే చాలా రకాలుగా ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సారి ఆర్బీఐ రూల్స్ ను కాస్తంత సరళతం చేస్తోంది. దాని వల్ల అన్ని బ్యాంకులకు ఆర్థిక పన్నుల విధానంలో విచ్చలవిడి తనం పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొత్త ఆర్థిక సంవత్సరంలో అనేక మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పెన్షన్ రెగ్యులేటర్ PFRDA, నేషనల్ పెన్షన్ సిస్టం (NPS) ఖాతాలోకి లాగిన్ అయ్యే నిబంధన మార్చింది. ఈ కొత్త ఆర్థిక ఏడాది నుంచి ఎన్ పీఎస్ ఖాతాలోకి లాగిన్ అవ్వడానికి యూజర్ ఐడీ పాస్ వర్డ్ తో పాటు ఆధార్ కార్డు లింక్ ఉన్న మొబైల్ నెంబర్ కూడా అవసరమే. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఖాతాలోకి వెళ్లగలరు. దాంతో పాటు ఈపీఎఫ్ వో రూల్స్ లో ఏప్రిల్ 1 నుంచి చాలా పెద్ద మార్పులు తెస్తోంది ఆర్బీఐ. కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) నుంచి, ఒక వ్యక్తి ఉద్యోగం మారితే అతని EPF ఖాతా ఆటోమేటిక్‌గా కొత్త కంపెనీకి బదిలీ అవుతుంది.
కానీ ఇంతకు ముందు మాత్రం అభ్యర్థి కోరితే మాత్రమే బదిలీ చేసేవారు. ఇక కొత్త ఏడాదిలో డిఫాల్ట్ పన్ను విధానం రాబోతోంది. ఈ కొత్త విధానంలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. లేదంటే మాత్రం మీ ITR కొత్త పన్ను విధానంలోనే ఫైల్ అవుతుంది. పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే, అదే పద్ధతిలో ITR పైల్ చేయవచ్చు. కొత్త పన్ను విధానంలో రూ. 7 లక్షల వరకు ఆదాయంపై ఒక్క రూపాయి కూడా టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక దాంతో పాటు ఎస్బీఐ బ్యాంకు డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ చార్జీని కూడా ఏకంగా 75 రూపాయలు పెంచాలని ఆర్బీఐ నిర్ణయించింది.
ఇక అటు క్రెడిట్ కార్డుల వినియోగదారులకు కూడా ఝలక్ ఇచ్చింది ఎస్బీఐ. SBI క్రెడిట్ కార్డ్‌తో చేసే అద్దె చెల్లింపుపై లభించే రివార్డ్ పాయింట్లను ఏప్రిల్ 1 నుంచి నిలిపివేస్తోంది. అటు అత్యవసర ఐషధాల ధరలను 0.0055 శాతం పెంచుతున్నట్లు భారత ఔషధ ధరల నియంత్రణ సంస్థ ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.