బతికున్న ప్రియురాలిని పాతిపెట్టిన ప్రియుడు ఘోరాతి ఘోరం..!!
సమాజంలో మనిషి చాలా కురవరంగా ప్రవర్తిస్తున్నాడు. మానవ విలువలు మర్చిపోయి అడవిలో ఉన్న క్రూర మృగాల కంటే ఘోరాతి ఘోరమైన ఘాతుకాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యంగా ఆడవాళ్ళపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. చట్టాలు వస్తున్నాగాని మొగడి ఆలోచనలో మార్పు రావటం లేదు. ప్రేమ పేరుతో మోసం చేసి చాలామంది ఆడవాళ్ళ జీవితాలను ఆట బొమ్మలుగా మార్చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. తాజాగా ఈ రకంగానే ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన ప్రియురాలిని బతికుండగానే ప్రియుడు పాతిపెట్టాడు.
సరే అమ్మాయి పట్ల అత్యంత రాక్షసత్వంగా ప్రవర్తించి.. ఆ అమ్మాయి కాపాడాలని అరుస్తున్న గాని పైశాచికమైన ఆనందం పొంది సజీవంగానే సమాధి చేసేసాడు. ఈ దుర్ఘటన ఆస్ట్రేలియాలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఇద్దరూ కూడా భారత సంతతికి చెందిన వాళ్లే. ఈ ఘటన 2021 లో జరిగింది. పంజాబ్ కి చెందిన జాస్మిన్ కౌర్.. ఆస్ట్రేలియాలో నర్సింగ్ కోర్స్ చేస్తుంది. ఆస్ట్రేలియాలో తారీక్ జోర్ సింగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. ఇద్దరి మధ్య కొన్నాళ్లపాటు ప్రేమ సజావుగానే సాగింది. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుని స్థిరపడాలని ఇద్దరు కలలు కన్నారు. కానీ తారీక్ లో మార్పు మొదలైంది.
సైకోలా ప్రవర్తించడం మొదలుపెట్టడంతో అతని తీరు జాస్మిన్ కి నచ్చలేదు. దీంతో తారిక్ నీ జాస్మిన్ పక్కన పెట్టడం జరిగింది. ఫలితంగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత ప్రియుడు తారీకు చాలా సార్లు బెదిరింపులకు పాల్పడిన జాస్మిన్ మాత్రం మరోసారి రిలేషన్ కి నో అని కరాకండిగా చెప్పడం జరిగింది. దీంతో తార్నిక్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తనకు దక్కనిది మరెవరికి దక్కకూడదని భావించాడు. దీంతో జాస్మిన్ నీ అంతం చేయాలని భావించాడు. ఈ క్రమంలో మార్చ ఐదు 2021న.. ఆమెకు ఫోన్ చేశాడు. చివరిసారిగా ఒక్కసారి కలిస్తే చాలు మరోసారి నిన్ను జీవితంలో ఇబ్బంది పెట్టను అని ఫోన్ లో అనగా దానికి జాస్మిన్.. దయచేసి నన్ను వదిలేయ్ అని బదులు ఇవ్వటం జరిగింది.
ఇక లాభం లేదని తార్ణిక్.. జాస్మిన్ ఉండే ప్రాంతానికి వెళ్లి ఆమె చేతులను వైర్లతో కట్టేసి కళ్ళకు కంతులు కట్టేసి మూతికి ప్లాస్టర్ వేసి.. కారు డిక్కీలో కుక్కేశాడు. ఆ తర్వాత ఏకంగా 640 కిలోమీటర్లు ప్రయాణించి.. నిర్మానుషమైన ప్రాంతంలో జాస్మిన్ గొంతు కోసి.. ఆ తరువాత చేతులకు కాళ్లకు కట్లు తెంపకుండానే గోతిలో పాతిపెట్టాడు. దీంతో జాస్మిన్ తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేయగా.. ప్రేమ వ్యవహారం బయటపడగా.. ఎప్పటినుండో విచారణ కొనసాగుతుండగా ఇటీవల తార్నిక్ చేసిన నేరాన్ని ఒప్పుకోవటంతో పోలీసులు అతన్ని అరెస్టు చేయడం జరిగింది.