
AP CM Ys Jagan vs central govt
Ys jagan కేంద్రం దూకుడు ఏపీ సీఎం జగన్ Ys jagan కొంప ముంచుతోంది. అవసరమైన విషయాల్లో.. ముఖ్యంగా జగనకు అంతో ఇంతో మైలేజీ ఇచ్చే విషయాల్లో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తూ.. ఇరుకున పెడుతుండగా.. శాసన మండలి విషయంలోమాత్రం.. జగన్ Ys jagan సర్కారు చేసిన తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉందనే సంకేతాలు ఇస్తుండడం ఇప్పుడు వైసీపీ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. దీంతో ఇప్పుడు చేయాలి ? అనే విషయం అధికార పార్టీలో అంతర్మథనానికి దారితీస్తోంది.
ఏడాదిన్నర కిందట.. రాష్ట్ర శాసన మండలిలో వైసీపీ బలం చాలాతక్కువ. టీడీపీ TDP అత్యంత బలంగా ఉండేది. అయితే.. అప్పట్లో జగన్ సర్కారు తీసుకువచ్చిన మూడు రాజధానులు, ఏపీ సీఆర్‌డీఏ రద్దు బిల్లులను టీడీపీ TDP మండలిలో వ్యతిరేకించింది. దీంతో జగన్ Ys jagan సర్కార్ మండలి రద్దుకు ప్రతిపాదించింది. మండలి వల్ల ఖర్చు తప్ప ప్రయోజనం లేదని.. అందుకే రద్దు చేస్తున్నామని.. ప్రజలకు ఉపయోగకరమైన రాష్ట్రానికి ప్రయోజనకరమైన నిర్ణయాలను కూడా టీడీపీ అడ్డుకుంటోందని.. అందుకే మండలి రద్దుకు ప్రతిపాదిస్తున్నామని.. నాడు సభలో ప్రకటించి..ఆవెంటనే రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపారు.
AP CM Ys Jagan vs central govt
అయితే.. ఏడాదిన్నర కాలమైన నేపథ్యంలో కేంద్ర యథావిధిగా ఇతర అంశాల మాదిరిగానే దీనిని కూడా చాపచట్టేసినట్టేననని అందరూ అనుకున్నారు. ఇప్పుడు మండలిలో వైసీపీ Ysrcp ఆధిపత్యం పెరుగుతూ వస్తోంది. మరికొద్ది నెలల్లోనే ఈ సంఖ్య మరీ పెరిగి.. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా వైసీపీతోనే శాసన మండలి నిండిపోతుంది. దీంతో ఇక, తమకు తిరుగులేదని.. వైసీపీ నాయకులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. అయితే.. ఇంతలోనే టీడీపీ TDP ఎంపీ.. కనకమేడల రవీంద్రకుమార్.. మండలి రద్దు తీర్మానం అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు.
Ys jagan
దీనికి కేంద్రం ఆసక్తికర సమాధానం ఇచ్చింది. రద్దు తీర్మానాన్ని పరిశీలిస్తున్నామని.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. దీంతో ఒక్కసారిగా వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలైంది. మండలి రద్దయితే.. వైసీపీ Ysrcp నేతలకు ఇతర పదవులు కేటాయించడం కష్టం. అలాగని రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకోమని కోరితే.. అది మరింత అవమానం.. మొత్తంగా కేంద్రం జగన్ Ys Jagan ను మరోసారి ఇరికించేసిందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. ఈ విషయమై అధికార పార్టీ నేతల్లో మల్లగుల్లాలు షురూ అయ్యాయి. ఇప్పటివరకు ఎమ్మెల్సీలపై భారీ ఆశలు పెట్టుకున్న నేతలంతా.. ఏం చేయాలోనని మధనపడుతున్నారని కేడర్ చర్చించుకుంటోంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.