Ys jagan : వైఎస్ జ‌గ‌న్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఆ ఒక్క నియోజకవర్గం..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ys jagan : వైఎస్ జ‌గ‌న్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఆ ఒక్క నియోజకవర్గం..!

Ys jagan ఆంధ్రప్రదేశ్ లో ఆ ఒక్క నియోజకవర్గం వైసీపీకి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఎన్ని వ్యూహాలు రచించినా అక్కడ జెండా పాతడం కష్టంగా మారింది. మరోసారి జేసీ బ్రదర్స్ జెండాను ఎగురవేసి సత్తా చాటారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా టీడీపీకి దక్కిన ఏకైక పీఠం తాడిపత్రి మాత్రమే.. అది కూడా జేసీ బ్రాండ్ తోనే అక్కడ గెలుపు సాధ్యమైంది. అయితే చైర్మన్ పదవి చేజారినా.. రెండో వైస్ చైర్మన్ పదవిని సొంతం […]

 Authored By sukanya | The Telugu News | Updated on :31 July 2021,5:14 pm

Ys jagan ఆంధ్రప్రదేశ్ లో ఆ ఒక్క నియోజకవర్గం వైసీపీకి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఎన్ని వ్యూహాలు రచించినా అక్కడ జెండా పాతడం కష్టంగా మారింది. మరోసారి జేసీ బ్రదర్స్ జెండాను ఎగురవేసి సత్తా చాటారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా టీడీపీకి దక్కిన ఏకైక పీఠం తాడిపత్రి మాత్రమే.. అది కూడా జేసీ బ్రాండ్ తోనే అక్కడ గెలుపు సాధ్యమైంది. అయితే చైర్మన్ పదవి చేజారినా.. రెండో వైస్ చైర్మన్ పదవిని సొంతం చేసుకోవాలని వైసీపీ భావించింది.

అందుకు గత కొన్ని రోజుల నుంచి వ్యూహాలు రచిస్తూనే ఉంది. కానీ ఆ వ్యూహాలను జేసీ తిప్పి కొట్టారు. తాడిపత్రిలో ఎలాగైనా తమ పట్టు నిలుపుకోవాలి అనుకున్నారు MLA పెద్దారెడ్డి. దీంతో రెండో వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో అనూహ్య పరిణామాలు ఏమైనా జరుగుతాయా అన్న అనుమానాలు ఉత్కంఠ పెంచాయి. కానీ చివరికి జేసీ ముందు ఆ అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి. తాడిపత్రి జేసీ అడ్డా అని.. ఇక్కడ పెద్దారెడ్డి ఆటలు చెల్లవని జేసీ ప్రభాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో రాజకీయంగా హీట్ ను పెంచాయి.

Ys jagan Bad news in anantapur municipal Elections

Ys jagan Bad news in anantapur municipal Elections

రెండో వైస్ ఛైర్మన్ .. Ys jagan

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ రెండవ వైస్ ఛైర్మన్‌గా పాతకోట బంగారు మునిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడిపత్రిలో టీడీపీకి 18, వైసీపీకి 16 వార్డులు వచ్చాయి. ఒకరు సీపీఐ నుంచి, మరొకరు ఇండిపెండెంట్‌గా గెలిచారు. వారిద్దరూ TDPకే మద్దతు ఇచ్చారు. దీంతో TDP బలం 20కి పెరిగింది. YCPకి ఇద్దరు ఎక్స్‌అఫిషియో సభ్యులు ఉన్నారు. దాంతో ఆ పార్టీ బలం 18కి చేరింది. వైసీపీ గైర్హాజరుతో ఎలాంటి నెంబర్‌ గేమ్‌ లేకుండానే టీడీపీ మద్దతుదారే వైస్‌ చైర్మన్‌ అయ్యారు. తాడిపత్రిలో గట్టిగా పట్టు పడితే రెండో చైర్మన్ పీఠం దక్కించుకోవడం వైసీపీ సాధ్యమయ్యేదే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

jc brothers

jc brothers

తాడిపత్రి సీపీఐ కాలనీలోని మున్సిపల్ స్థలంలో కొందరు అక్రమంగా ఇళ్లు కట్టుకున్నారని అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ కుటుంబాలకు మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మద్దతు పలికారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌన్సిలర్లను వేధించడం పద్ధతి కాదని హెచ్చరించారు ప్రభాకర్‌రెడ్డి. దీంతో రెండో వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎలాంటి పరిణామాలు నెలకుంటాయో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ జేసీ తన మద్దతు దారులందరినీ తనకు సపోర్ట్ గా ఉండేలా చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో వైసీపీ వ్యూహాలు అన్నీ బెడిసి కొట్టాయి..

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది