Urine on Face : గిరిజనుడి ముఖంపై మూత్రం పోసిన బీజేపీ నేత.. వీడియో వైరల్..!
Urine on Face : ఎన్ని జనరేషన్స్ మారినా జనాల మైండ్ సెట్ మాత్రం మారడం లేదు. ఇంకా మతాలు, కులాలు అంటూ ఆధిపత్య ధోరణి ప్రవర్తిస్తున్నారు. చిన్న కులం, పెద్ద కులం అంటూ తేడాలు చూస్తున్నారు. తాజాగా అలాంటి దారుణ ఘటన ఒకటి మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఆ వ్యక్తిపై తీవ్రస్థాయిలో దూషిస్తున్నారు.
ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి కింద కూర్చొని ఉన్న మరో వ్యక్తి ముఖంపై మూత్రం పోస్తాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వ్యక్తిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అతడు ఎవరో కాదు.. బీజేపీకి చెందిన నేత. పేరు పర్వేజ్ శుక్లా. అతడు మధ్య ప్రదేశ్ లోని సిధి జిల్లాకు చెందిన వ్యక్తి. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Urine on Face : పర్వేజ్ శుక్లా ఇంటిని కూల్చేసిన పోలీసులు
అతడు ఒక బీజేపీ నేత అని తెలియడంతో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. దీంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు చివరకు అతడి ఇంటిని కూడా కూల్చేశారు. అతడి మీద జాతీయ భద్రతా చట్టం కింద, పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే.. శుక్లా బీజేపీకి చెందిన నేత అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అతడు బీజేపీకి చెందిన నేత కాదని బీజేపీ స్పష్టం చేస్తోంది. ఈ ఘటనపై నలుగురు సభ్యులతో కమిటీని వేసింది. ఆ వీడియో చివరికి సీఎం శివరాజ్ సింగ్ దృష్టికి కూడా వెళ్లింది.