Home » National » Breaking News Us President Trump Sensational Comments
National

Donald Trump : బ్రేకింగ్ న్యూస్ .. నా వల్లే 3.5 కోట్ల మంది ప్రాణాలు నిలిచాయి .. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

Authored By
Suma
The Telugu News | Updated on: February 25, 2026 12:48 pm
Advertisement

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్–పాక్ మధ్య అణు యుద్ధం తలెత్తే పరిస్థితిని తానే అడ్డుకున్నానని తన జోక్యం లేకపోతే పాకిస్థాన్ ప్రధానమంత్రి ప్రాణాలు పోయేవని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా సుమారు 3.5 కోట్ల మంది పాకిస్థాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పది నెలల్లోనే ఎనిమిది యుద్ధాలను ఆపానని చెప్పిన ట్రంప్ అందులో భారత్–పాక్ ఘర్షణ అత్యంత కీలకమైందని తెలిపారు.

Advertisement

Donald Trump : బ్రేకింగ్ న్యూస్ .. నా వల్లే 3.5 కోట్ల మంది ప్రాణాలు నిలిచాయి .. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

Donald Trump : అణు యుద్ధం అంచున నిలిచిన భారత్–పాక్

ట్రంప్ చెప్పిన వివరాల ప్రకారం గతేడాది మే నెలలో భారత్ “ఆపరేషన్ సింధూర్” పేరుతో పాకిస్థాన్‌పై దాడులు చేపట్టిన సమయంలో రెండు దేశాలు అణు యుద్ధం అంచుల దాకా వెళ్లాయని ఆయన అన్నారు. ఆ సమయంలో తాను వెంటనే జోక్యం చేసుకుని ఉద్రిక్తతలను తగ్గించానని చెప్పారు. తన చొరవ వల్లే పరిస్థితి అదుపులోకి వచ్చిందని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా మారేవని ట్రంప్ వెల్లడించారు. తన జోక్యం గురించి పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్వయంగా అభినందించారని కోట్లాది ప్రజల ప్రాణాలు నిలిచాయని తనతో చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు. అణు యుద్ధం జరిగి ఉంటే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండేదని దక్షిణాసియాలో భారీ వినాశనం సంభవించేదని ఆయన వివరించారు.

Advertisement

Donald Trump : 200 శాతం టారిఫ్ హెచ్చరికతో శాంతి?

భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో తాను కేవలం చూస్తూ కూర్చోలేదని ట్రంప్ అన్నారు. రెండు దేశాలు యుద్ధాన్ని ఆపకపోతే 200 శాతం టారిఫ్‌లు విధిస్తానని కఠిన హెచ్చరిక జారీ చేశానని తెలిపారు. ఆర్థిక ఒత్తిడి కారణంగానే ఇరు దేశాలు చర్చలకు ముందుకొచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా కాంగ్రెస్‌లో జరిగిన “స్టేట్ ఆఫ్ ది యూనియన్” ప్రసంగంలో కూడా ట్రంప్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అణు యుద్ధం తలెత్తే ప్రమాదాన్ని తానే అడ్డుకున్నానని గర్వంగా ప్రకటించారు. ప్రపంచ శాంతి కోసం తాను కృషి చేస్తున్నానని అమెరికా నాయకత్వం అంతర్జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.

Donald Trump : భారత్ ఖండన … మధ్యవర్తిత్వం లేదన్న కేంద్రం

అయితే ట్రంప్ వ్యాఖ్యలను భారత్ మాత్రం పూర్తిగా ఖండిస్తోంది. భారత్–పాక్ మధ్య ఎలాంటి అమెరికా మధ్యవర్తిత్వం జరగలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు దేశాల సైన్యాధికారుల మధ్య జరిగిన చర్చల ఫలితంగానే కాల్పులు ఆగాయని అధికార వర్గాలు తెలిపాయి. 2025 ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సరిహద్దు దాటి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరిగినా భారత ప్రభుత్వం తన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుందని స్పష్టం చేసింది. ట్రంప్ తన పాత్రను అతిశయోక్తిగా చూపిస్తున్నారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. భారత్ మాత్రం తన భద్రతా చర్యలు పూర్తిగా అంతర్గత వ్యూహాల ప్రకారమే జరిగాయని దృఢంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. నిజంగా యుద్ధం అంచున పరిస్థితులు వెళ్లాయా? లేక ఇది రాజకీయ ప్రకటనల కోణంలో వచ్చిన వ్యాఖ్యలా? అన్నది ఇప్పుడు విశ్లేషకుల మధ్య చర్చకు దారి తీస్తోంది.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి