
Donald Trump : అమెరికా జాతీయ గీతం నిషేదంపై ట్రంప్ స్ట్రాంగ్ రియాక్షన్.. చైనా కూడా ధీటైన రియాక్షన్
Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. ఊహించిన డెసిషన్ తీసుకుంటూ పలు దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తాజాగా అగ్రరాజ్యంలోని కెనడా,మెక్సికోతో పాటు చైనాపైనా ట్రంప్ భారీగా టారిఫ్ విధించడం మనం చూశాం. కెనాడాపై ట్రంప్ 25శాతం టారిఫ్ ను విధించి అందర్నీ షాక్ కు గురిచేశాడు. ట్రంప్ నిర్ణయంపై కెనడా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కెనడా దేశస్థులు అమెరికా ఎంత ఫైర్ మీద ఉన్నారో ఈ ఘటనని బట్టి అర్దమవుతుంది. కెనడాలోని ఒట్టావా నగరంలో తాజాగా హాకీ టోర్నమెంట్ జరిగింది.
సాధారణంగా ఆట ప్రారంభం ముందు ప్లేయర్స్ అంతా జాతీయగీతాన్ని ఆలపించడం ఆనవాయితీ. ఒట్టావాకు చెందిన సింగర్ మండియా.. అమెరికా జాతీయగీతాన్ని ఆలపించడం ప్రారంభించింది. దీంతో ప్లేయర్స్ తోపాటు స్టేడియంలోని ప్రేక్షకులు ఆ గీతాన్ని పాడేందుకు నిరాకరించారు. జాతీయ గీతం పాడొద్దంటూ నినాదలు చేశారు. ఆ తర్వాత సింగర్ మండియా కెనడా జాతీయ గీతం పాడారు. ఆ పాటను మాత్రం ప్రేక్షకులు పాడారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని పలువురు క్రిటిక్స్ చెప్తున్నారు. అయితే దీనిపై స్పందించిన కెనడా ప్రధాని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎమోషనల్ అయ్యారు.
Donald Trump : అమెరికా జాతీయ గీతం నిషేదంపై ట్రంప్ స్ట్రాంగ్ రియాక్షన్.. చైనా కూడా ధీటైన రియాక్షన్
ఇప్పుడు మనమంతా ఒకటిగా ఉండాలని.. కష్టకాలం రాబోతోందని తెలిపారు. మనదేశాన్ని మనమే కాపాడుకోవాలన్నారు. కెనడా ప్రజలకోసం పనిచేస్తానని తెలిపారు. అయితే కెనడా, మెక్సికో దేశాల్లో టారిఫ్ విధించిన తర్వాత ఆ దేశాల్లో అమెరికాపై పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తాడనేది చూడాలి. మరోవైపు అమెరికా ఏకపక్షంగా సుంకాలను పెంచడం ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇది అమెరికా సమస్యలను పరిష్కరించడంలో సహాయపడకపోవడమే కాకుండా.. చైనా, అమెరికాల మధ్య సాధారణ ఆర్థిక, వాణిజ్య సహకారాన్నికూడా దెబ్బతీస్తుందని ప్రకటనలో తెలిపింది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.