Donald Trump : అమెరికా జాతీయ గీతం నిషేదంపై ట్రంప్ స్ట్రాంగ్ రియాక్ష‌న్.. చైనా కూడా ధీటైన రియాక్ష‌న్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Donald Trump : అమెరికా జాతీయ గీతం నిషేదంపై ట్రంప్ స్ట్రాంగ్ రియాక్ష‌న్.. చైనా కూడా ధీటైన రియాక్ష‌న్

 Authored By ramu | The Telugu News | Updated on :4 February 2025,7:07 pm

Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. ఊహించిన‌ డెసిషన్ తీసుకుంటూ పలు దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తాజాగా అగ్రరాజ్యంలోని కెనడా,మెక్సికోతో పాటు చైనాపైనా ట్రంప్ భారీగా టారిఫ్ విధించడం మ‌నం చూశాం. కెనాడాపై ట్రంప్ 25శాతం టారిఫ్ ను విధించి అందర్నీ షాక్ కు గురిచేశాడు. ట్రంప్ నిర్ణయంపై కెనడా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కెనడా దేశస్థులు అమెరికా ఎంత ఫైర్ మీద ఉన్నారో ఈ ఘ‌ట‌న‌ని బట్టి అర్ద‌మ‌వుతుంది. కెనడాలోని ఒట్టావా నగరంలో తాజాగా హాకీ టోర్నమెంట్ జరిగింది.

Donald Trump : గ‌రం గ‌రం..

సాధార‌ణంగా ఆట ప్రారంభం ముందు ప్లేయర్స్ అంతా జాతీయగీతాన్ని ఆలపించడం ఆనవాయితీ. ఒట్టావాకు చెందిన సింగర్ మండియా.. అమెరికా జాతీయగీతాన్ని ఆలపించడం ప్రారంభించింది. దీంతో ప్లేయర్స్ తోపాటు స్టేడియంలోని ప్రేక్షకులు ఆ గీతాన్ని పాడేందుకు నిరాకరించారు. జాతీయ గీతం పాడొద్దంటూ నినాద‌లు చేశారు. ఆ తర్వాత సింగర్ మండియా కెనడా జాతీయ గీతం పాడారు. ఆ పాటను మాత్రం ప్రేక్షకులు పాడారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని పలువురు క్రిటిక్స్ చెప్తున్నారు. అయితే దీనిపై స్పందించిన కెన‌డా ప్ర‌ధాని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎమోషనల్ అయ్యారు.

Donald Trump అమెరికా జాతీయ గీతం నిషేదంపై ట్రంప్ స్ట్రాంగ్ రియాక్ష‌న్ చైనా కూడా ధీటైన రియాక్ష‌న్

Donald Trump : అమెరికా జాతీయ గీతం నిషేదంపై ట్రంప్ స్ట్రాంగ్ రియాక్ష‌న్.. చైనా కూడా ధీటైన రియాక్ష‌న్

ఇప్పుడు మనమంతా ఒకటిగా ఉండాలని.. కష్టకాలం రాబోతోందని తెలిపారు. మనదేశాన్ని మనమే కాపాడుకోవాలన్నారు. కెనడా ప్రజలకోసం పనిచేస్తానని తెలిపారు. అయితే కెనడా, మెక్సికో దేశాల్లో టారిఫ్ విధించిన తర్వాత ఆ దేశాల్లో అమెరికాపై పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తాడ‌నేది చూడాలి. మ‌రోవైపు అమెరికా ఏకపక్షంగా సుంకాలను పెంచడం ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇది అమెరికా సమస్యలను పరిష్కరించడంలో సహాయపడకపోవడమే కాకుండా.. చైనా, అమెరికాల మధ్య సాధారణ ఆర్థిక, వాణిజ్య సహకారాన్నికూడా దెబ్బతీస్తుందని ప్రకటనలో తెలిపింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది