Home » Exclusive » Farmers Get %e2%82%b93000 Pension Every Month Latest Govt Scheme
Exclusive

Farmers : రైతులు ఇలా చేస్తే ప్రతి నెలా రూ.3వేలు పొందవచ్చు.. ఎలాగంటే..?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: March 24, 2024, 8:00 am
Advertisement

Farmers  : ఏ ప్రభుత్వ హయాంలో అయినా సరే అట్టడుగు వర్గాలకు లబ్ది చేకూరే వేధంగా కొన్ని విధానాలను రూపొందిస్తారు. అందులో కొన్ని సంక్షేమ పథకాలు కూడా ఉంటాయి. ఎందుకంటే సమాజంలో చాలా రకాల వర్గాల ప్రజలు ఉంటారు. అందరూ ఒకే స్థాయి ఆర్థిక బలాలను కలిగి ఉండరు. కాబట్టి ఈ విధమైన వర్గాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చాలారకాల విధానాలను రూపొందించింది. అందులోనూ రైతలును, నిరుపేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్పుడు కొత్త పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ పథకం ద్వారా రైతులకు మంచి ఆర్థికవృద్ధి చేకూరుతుందని చెబుతున్నారు.ఇందులో ప్లాన్ కింద నెలకు 55 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత 60 సంవత్సరాల పెట్టుబడి తర్వాత, మీరు నెలకు రూ. 3000 పొందుతారు. మరిదీనికి సంబంధించినపూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Farmers  ప్రధాన మంత్రి కిసాన్ మన్ ధన్ పథకం..

ఈ పథకాన్ని పూర్తిగా పేద రైతుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చింది.ఇందులో భాగంగా 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న రైతులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం వల్ల వృద్ధాప్యంలో రైతులు ఆనందంగా జీవించేందుకు ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో పింఛన్ రూపంలో ఆర్థిక భరోసా ఇవ్వనుంది ఈ పథకం.ఎందుకంటే ఇప్పుడు చాలా ఇళ్లలో పిల్లలు తమ తల్లిదండ్రులు చూసుకోలేకపోతున్నారు. అందుకే అలాంటి తల్లిదండ్రుల కోసం ఇప్పుడు ఈ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్లాన్ లో పెట్టుబడి రూపంలో డబ్బులు ఆదా చేసి.. వృద్ధాప్యంలో వాటిని పింఛన్ రూపంలో పొందవచ్చు.

Farmers : రైతులు ఇలా చేస్తే ప్రతి నెలా రూ.3వేలు పొందవచ్చు.. ఎలాగంటే..?

Advertisement

కాకపోతే ఈ పథకానికి అందరూ అర్హులు కారు. కేవలం 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు మధ్య ఉన్న రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. వాయిదా వయస్సు ఆధారంగా ఉంటుంది. 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే నెలకు రూ.55 రూపాయలు ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత రూ.110, 40 ఏళ్ల నుంచి ప్రారంభిస్తే రూ.220 చెల్లించాల్సి ఉంటుంది ఉంటుందని చెబుతున్నారు. అది కూడా నెలకు మాత్రమే.అయితే మీ వయసు ఎప్పుడైతే 60 ఏళ్లు నిండుతుందో అప్పటి నుంచి ప్రతినెలకు రూ.3వేలు ఇస్తారు. ఇదిమీరు బతికి ఉన్నంత కాలం వర్తిస్తుంది. ఇలా ప్రతి నెల 3వేల రూపాయలు అంటే.. ఒక్క ఏడాదికి రూ.36వేల వరకు లబ్దిదారుడిఖాతాలో జమ చేస్తారన్న మాట. అర్హులైన రైతులు వెంటనే దరఖాస్తు చేసుకొని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి