
MS Dhoni : సీఎస్‌కే అభిమానులకి ఇది పెద్ద షాకింగే.. ఐపీఎల్ 2024 నుండి మహేంద్ర సింగ్ ధోని ఔట్...?
MS Dhoni : మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం లిఖించిన ధోని కొన్ని సంవత్సరాల క్రితం అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అనే టాక్ కూడా నడుస్తుంది. అయితే ఇన్నాళ్లు చెన్నైకి కెప్టెన్‌గా ఉన్న ధోని ఎవరూ ఊహించని విధంగా కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో బహుశా ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా 2023 సీజన్‌లో సీఎస్కే కప్పు గెలిచిన తర్వాత మోకాలి సర్జరీ చేయించుకున్న ధోని అప్పటి నుండి రిటైర్మెంట్ అవుతాడనే టాక్ వినిపిస్తుంది.కాని అనూహ్యంగా ఈ సీజన్ ఆడుతున్నాడు.
అయితే ఈ సీజన్ నుండి ధోని ఔట్ అనే టాక్ వినిపిస్తుంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో ధోని కెప్టెన్‌గా కాకుండా ఆటగాడిగా ప్రవేశించి వికెట్ల వెనుకాల తన మ్యాజిక్‌ను కొనసాగించాడు. అయితే ధోనీకి సంబంధించి ఒక వెటరన్ బ్యాట్స్‌మెన్ చేసిన ప్రకటన ఇప్పుడు అందరికి షాకింగ్‌గా మారింది. ఈ సీజన్‌లోని అన్ని మ్యాచ్‌లు ధోని ఆడడని, లీగ్ మధ్యలో విరామం తీసుకుంటాడు అంటూ వెస్టిండీస్ తుఫాన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆర్సీబీ, చెన్నై మ్యాచ్‌కి ముందు గేల్ ఈ కామెంట్స్ చేశాడు. ధోని ఈ సీజన్‌లో స్వల్ప విరామం తీసుకుంటాడని, అందుకే స్టార్టింగ్‌లో కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడని అన్నారు.
MS Dhoni : సీఎస్‌కే అభిమానులకి ఇది పెద్ద షాకింగే.. ఐపీఎల్ 2024 నుండి మహేంద్ర సింగ్ ధోని ఔట్…?
అంతేకాదు ధోని తీసుకున్న నిర్ణయంతో అతడు ఇంకా రాణించే అవకాశం ఉంది. ఎవరు కూడా ఆందోళన చెందవద్దు అని అన్నారు. అయితే క్రిస్ గేల్ చెప్పిన థియరీ ప్రకారం ధోని ఈ సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉండడని తెలియడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దయచేసి ఈ ఒక్క సీజన్ ఆడండని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ధోని ఈ సీజన్ లో లాంగ్ హెయిర్‌తో, కొత్త లుక్‌లో కనిపించాడు . కూల్ ధోని పాత రోజులను గుర్తు చేస్తున్నాడని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
This website uses cookies.