Farmers : రైతులు ఇలా చేస్తే ప్రతి నెలా రూ.3వేలు పొందవచ్చు.. ఎలాగంటే..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Farmers : రైతులు ఇలా చేస్తే ప్రతి నెలా రూ.3వేలు పొందవచ్చు.. ఎలాగంటే..?

Farmers  : ఏ ప్రభుత్వ హయాంలో అయినా సరే అట్టడుగు వర్గాలకు లబ్ది చేకూరే వేధంగా కొన్ని విధానాలను రూపొందిస్తారు. అందులో కొన్ని సంక్షేమ పథకాలు కూడా ఉంటాయి. ఎందుకంటే సమాజంలో చాలా రకాల వర్గాల ప్రజలు ఉంటారు. అందరూ ఒకే స్థాయి ఆర్థిక బలాలను కలిగి ఉండరు. కాబట్టి ఈ విధమైన వర్గాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చాలారకాల విధానాలను రూపొందించింది. అందులోనూ రైతలును, నిరుపేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్పుడు కొత్త పథకాన్ని […]

 Authored By ramu | The Telugu News | Updated on :24 March 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Farmers : రైతులు ఇలా చేస్తే ప్రతి నెలా రూ.3వేలు పొందవచ్చు.. ఎలాగంటే..?

Farmers  : ఏ ప్రభుత్వ హయాంలో అయినా సరే అట్టడుగు వర్గాలకు లబ్ది చేకూరే వేధంగా కొన్ని విధానాలను రూపొందిస్తారు. అందులో కొన్ని సంక్షేమ పథకాలు కూడా ఉంటాయి. ఎందుకంటే సమాజంలో చాలా రకాల వర్గాల ప్రజలు ఉంటారు. అందరూ ఒకే స్థాయి ఆర్థిక బలాలను కలిగి ఉండరు. కాబట్టి ఈ విధమైన వర్గాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చాలారకాల విధానాలను రూపొందించింది. అందులోనూ రైతలును, నిరుపేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్పుడు కొత్త పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ పథకం ద్వారా రైతులకు మంచి ఆర్థికవృద్ధి చేకూరుతుందని చెబుతున్నారు.ఇందులో ప్లాన్ కింద నెలకు 55 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత 60 సంవత్సరాల పెట్టుబడి తర్వాత, మీరు నెలకు రూ. 3000 పొందుతారు. మరిదీనికి సంబంధించినపూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Farmers  ప్రధాన మంత్రి కిసాన్ మన్ ధన్ పథకం..

ఈ పథకాన్ని పూర్తిగా పేద రైతుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చింది.ఇందులో భాగంగా 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న రైతులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం వల్ల వృద్ధాప్యంలో రైతులు ఆనందంగా జీవించేందుకు ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో పింఛన్ రూపంలో ఆర్థిక భరోసా ఇవ్వనుంది ఈ పథకం.ఎందుకంటే ఇప్పుడు చాలా ఇళ్లలో పిల్లలు తమ తల్లిదండ్రులు చూసుకోలేకపోతున్నారు. అందుకే అలాంటి తల్లిదండ్రుల కోసం ఇప్పుడు ఈ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్లాన్ లో పెట్టుబడి రూపంలో డబ్బులు ఆదా చేసి.. వృద్ధాప్యంలో వాటిని పింఛన్ రూపంలో పొందవచ్చు.

Farmers రైతులు ఇలా చేస్తే ప్రతి నెలా రూ3వేలు పొందవచ్చు ఎలాగంటే

Farmers : రైతులు ఇలా చేస్తే ప్రతి నెలా రూ.3వేలు పొందవచ్చు.. ఎలాగంటే..?

కాకపోతే ఈ పథకానికి అందరూ అర్హులు కారు. కేవలం 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు మధ్య ఉన్న రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. వాయిదా వయస్సు ఆధారంగా ఉంటుంది. 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే నెలకు రూ.55 రూపాయలు ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత రూ.110, 40 ఏళ్ల నుంచి ప్రారంభిస్తే రూ.220 చెల్లించాల్సి ఉంటుంది ఉంటుందని చెబుతున్నారు. అది కూడా నెలకు మాత్రమే.అయితే మీ వయసు ఎప్పుడైతే 60 ఏళ్లు నిండుతుందో అప్పటి నుంచి ప్రతినెలకు రూ.3వేలు ఇస్తారు. ఇదిమీరు బతికి ఉన్నంత కాలం వర్తిస్తుంది. ఇలా ప్రతి నెల 3వేల రూపాయలు అంటే.. ఒక్క ఏడాదికి రూ.36వేల వరకు లబ్దిదారుడిఖాతాలో జమ చేస్తారన్న మాట. అర్హులైన రైతులు వెంటనే దరఖాస్తు చేసుకొని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది