
Jackpot : జాక్ పాట్ కొట్టిన భారతీయుడు.. ఏకంగా 45 కోట్లు గెలుచుకున్నాడు..!
jackpot : యూఏఈ కి వలస వెళ్లిన భారతీయుడు అక్కడ నిర్వహించిన లాటరీలో ఏకంగా రూ. 45 కోట్లు గెలుచుకున్నారు. ఈ లాటరీ రావడంతో అతను షాకింగ్ కి గురయ్యాడు. కేరళకు చెందిన 39 ఏళ్ల శ్రీజు 11 ఏళ్ల క్రితం యూఏఈ కి వలస వెళ్ళారు. అక్కడ ఉన్న ఓ ఆయిల్ కంపెనీలో కంట్రోల్ రూమ్ ఆపరేటర్ గా పని చేస్తున్నారు. అయితే అక్కడ ప్రతిరోజు జరిగే మహ్ జూజ్ సాటర్డే మిలియన్స్ డ్రా టికెట్టు కొనుగోలు చేశారు. అయితే ఆ లాటరీని బుధవారం రివీల్ చేశారు. ఆ తర్వాత శ్రీజు స్టోరీ మారిపోయింది. ఆ లాటరీలో ఏకంగా 45 కోట్లు గెలుచుకున్నాడు.
ఇక శ్రీజు మాట్లాడుతూ .. అప్పుడు నేను కారులో ఉన్నాను, నా మహ్ జూజ్ ఎకౌంట్ చూద్దామని అనిపించింది. వెంటనే ఓపెన్ చేసి చూశాను నా కళ్ళు తిరిగాయి. నాకు లాటరీ వచ్చిందని నమ్మలేకపోయాను. మహ జూజ్ సిబ్బంది ఫోన్ చేసి చెప్పేదాకా నేను నమ్మలేకపోయాను అని శ్రీజు తెలిపారు. మన భారతీయులు చాలామంది అరబ్ దేశాల్లో ఉన్నారు. వారికి కూడా ఇలాగే చాలామందికి లాటరీ వచ్చింది. ఇటీవల కాలంలో ఈ వార్తలు బాగా వినిపిస్తున్నాయి ఆ మధ్య కేరళలో కూడా 11 మంది మహిళలు కలిసి డబ్బు పోగు చేసుకుని లాటరీ కొన్నారు. వారికి కూడా ఈ విధంగానే జాక్పాట్ తగిలింది. దీంతో వారి లైఫ్ నే మారిపోయింది.
అరబ్ దేశంలో ఉన్న మరో భారతీయుడు కూడా ఈ మహజూజ్ సాటర్డే మిలియన్స్ లక్కీ డ్రా లో జాక్పాట్ కొట్టాడు. ముంబై కి చెందిన మనోజ్ భన్సర్ అరబ్ దేశంలోని అబుదాబిలో పదహారేళ్లుగా ఎలక్ట్రానిక్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. అతడికి కూడా ఈ లక్కీ డ్రాలో 16 లక్షల దాకా లాటరీ తగిలింది. ఈ జాక్పాట్ తో మనోజ్ తన అప్పులని తీర్చానని సంతోషంగా చెప్పారు. అయితే యూఏఈ లోని లాటరీలకు ఒక స్పెషాలిటీ ఉంది. ఎలాంటి టాక్స్ లేకుండా గెలిచిన మొత్తాన్ని విజేతలకు అందిస్తారు. అదే ఇతర దేశాలలో అయితే చాలావరకు టాక్స్ కట్టాల్సి వస్తుంది.
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.