MS Dhoni : భారత క్రికెట్ చరిత్రలో మహేంద్రసింగ్ ధోనీకి ఒక ప్రత్యేక చోటు ఉంది. కెప్టెన్ గా దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఘనత అతనిదే. భారత క్రికెట్ ను అత్యున్నత శిఖరాల వైపు తీసుకెళ్లిన స్ఫూర్తిదాయక సారధి అతడే. అందుకే ధోని క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చిన అతడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తిరుగులేని నాయకుడిగా ఘనత, కోట్ల ఆస్తులు, అంతకుమించి కోట్లాదిమంది అభిమానులు. ఇన్ని సంపాదించుకున్నా ధోని చాలా సింపుల్గా ఉంటారు. దీనికి అద్గం పట్టే ఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది ధోని తన భార్య సాక్షి సింగ్, కుమార్తె జీవాతో కలిసి ఉత్తరాఖండ్లోని తమ పూర్వీకులు నివసించిన ల్వాలి అనే గ్రామాన్ని బుధవారం సందర్శించారు.
సుమారు 20 ఏళ్ల తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లిన ధోని తన ఫ్యామిలీతో కలిసి ఆ గ్రామాన్ని పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులలో ఒకడిగా ధోని కలిసిపోయి వారిని ఆప్యాయంగా పలకరించారు. ఈ క్రమంలోనే గ్రామంలోని వారంతా ధోనితో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. అలా వారితో ఫోటోలు దిగుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ క్రమంలోనే తనను పలకరించిన ఓ పెద్ద ఆవిడ పాదాలకు నమస్కరించారు ధోని దంపతులు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ధోని సింప్లిసిటీ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ధోని గ్రేట్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే 1970లో ధోని తండ్రి పాన్ సింగ్ లవాలి గ్రామంలో నివసించేవారు. ఆ తర్వాత స్టీల్ మిల్లులో పనిచేసేందుకు పాన్ సింగ్ కుటుంబం రాంచీకి వలస వెళ్లింది. అయితే లవాలీ గ్రామం ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. అల్మోరా జిల్లా కేంద్రానికి సుమారుగా 75 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఇప్పటికీ ధోని బంధువులు చాలామంది ఈ ఊర్లో ఉన్నారు. ధోని కుటుంబం రాకతో లవాలీ గ్రామంలో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. ఇక 2019 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్తో జరిగినగ సెమీ ఫైనల్ లో ధోని రన్ అవుట్ అయ్యారు. ఆ తర్వాత 2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నారు. ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్గా గెలిచిన సంగతి తెలిసిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.