Home » National » Narendra Modi Praises Jayalalithaa
National

Modi : ‘అమ్మ’ను ఆకాశానికి ఎత్తేసిన మోడీ..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: February 25, 2026 5:14 pm
Advertisement

Modi : తమిళనాడు Tamil Nadu దివంగత సిఎం, అన్నాడిఎంకే వ్యవస్థాపకురాలు జయలలితపై ప్రధాని నరేంద్ర మోడీ Modi ప్రసంశల వర్షం కురిపించారు. జయలలిత 78వ జయంతి (ఫిబ్రవరి 24) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. జయలలిత అద్భుతమైన, ‘ఆకర్షణీయమైన నాయకురాలు’గా ప్రధాని మోడీ కీర్తించారు. అదే విధంగా ‘అసాధారణమైన పరిపాలకురాలు’గా ప్రశంసించారు మోడీ. సమాజ సంక్షేమం కోసం పాటుపడే వారు ఎప్పుడూ ప్రజల హృదయాల్లో ఉంటారన్నారు మోడీ.

Advertisement

Modi : ‘అమ్మ’ను ఆకాశానికి ఎత్తేసిన మోడీ..!

అమ్మ జయలలిత అటువంటి ప్రజాదరణ పొందిన నాయకురాలని కొనియాడారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళా సాధికారత, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన కృషిని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. జయలలిత గారి జీవిత ప్రయాణం ఎంతో పట్టుదల, మనోధైర్యంతో కూడుకున్నదని ప్రధాని కొనియాడారు. ఇక జయలలితతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు.

Advertisement

‘మన్‌ కీ బాత్’ లో మోడీ మాట్లాడుతూ.. 2002, 2012లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆమె హాజరయ్యారని తెలిపారు. గతంలో పొంగల్ పండుగ సందర్భంగా చెన్నైలో ఆమె తనను భోజనానికి ఆహ్వానించిన విషయాన్ని, ఆ ఆత్మీయతను ఎప్పటికీ మర్చిపోలేనని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆలోచనలు చాలా స్పష్టంగా ఉండేవని, సుపరిపాలన గురించి తామిద్దరం తరచుగా చర్చించుకునేవాళ్లమని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి