India Lockdown Again : భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్? కేంద్రం సంచలన ప్రకటన..!
India Lockdown Again : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒకటే చర్చ.. వాట్సాప్ గ్రూపుల్లో ఒకటే గుసగుస.. భారత్ మరోసారి గడప దాటని రోజుల్లోకి వెళ్లనుందా? కరోనా కష్టకాలం నాటి చీకటి రోజులు మళ్లీ రాబోతున్నాయా? ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ మేఘాల నేపథ్యంలో దేశంలో మళ్ళీ ‘లాక్‌డౌన్’ Lockdown విధించబోతున్నారా? అనే ప్రశ్నలు కోట్లాది మంది భారతీయులను తీవ్రంగా కలవరపెట్టాయి. యుద్ధం ముదురుతుండటం, ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు దెబ్బతింటాయనే వార్తలతో జనాల్లో మొదలైన ఈ భయాందోళనలపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు మౌనం వీడింది. లాక్‌డౌన్ ఊహాగానాలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి అత్యంత కీలక ప్రకటన చేసి ప్రజలకు ఊరటనిచ్చారు.
#image_title
India Lockdown Again లాక్‌డౌన్ వార్తలు పూర్తిగా అవాస్తవం
దేశంలో లాక్‌డౌన్ విధించే ఆలోచన ప్రభుత్వానికి అస్సలు లేదని కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, “దేశంలో లాక్‌డౌన్ విధిస్తారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం. అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వం ముందు లేదు” అని తేల్చి చెప్పారు. ఇలాంటి కష్ట సమయాల్లో ప్రజలు ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐకమత్యంగా ఉండాలని ఆయన కోరారు. బాధ్యతారాహిత్యంగా ఇలాంటి హానికరమైన పుకార్లను వ్యాప్తి చేయవద్దని హెచ్చరించారు.
India Lockdown Again అసలు ఈ ప్రచారం ఎందుకు మొదలైంది?
పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి “కోవిడ్ సమయంలో చూపినంత సంసిద్ధత” Covid-like preparedness మనకు అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పార్లమెంటులో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారేమో అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయి.
యుద్ధం ముదిరినా.. మన దగ్గర ‘చమురు’ పుష్కలం
ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ (Strait of Hormuz) మూసివేస్తారనే భయాలు ఉన్నప్పటికీ, భారత్ ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరా ఆగిపోతుందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌కు 41 కంటే ఎక్కువ దేశాల నుంచి ముడి చమురు అందుతోందని, ముఖ్యంగా పశ్చిమ దేశాల నుంచి సరఫరా పెరగడం వల్ల ఏవైనా అంతరాయాలు ఏర్పడినా వాటిని సమర్థవంతంగా భర్తీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత్ వద్ద రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు Crude oil reserves సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం వంటి ముందస్తు చర్యలను కూడా కేంద్రం ఇప్పటికే చేపట్టింది.
ప్రధాని మోదీ నిరంతర పర్యవేక్షణ
ప్రపంచ దేశాల్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోందని మంత్రి పూరి పేర్కొన్నారు. “నిత్యావసర వస్తువులు, ఇంధనం, శక్తి వనరుల సరఫరాలో మన పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి భారత్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. అస్థిరమైన అంతర్జాతీయ పరిస్థితుల మధ్య కూడా భారత్ గతంలో తన ఆర్థిక స్థిరత్వాన్ని నిరూపించుకుంది. భవిష్యత్తులోనూ మనం సమన్వయంతో సరైన సమయంలో స్పందిస్తాం” అని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటనతో గత కొన్ని రోజులుగా ఊపిరి బిగబట్టిన సామాన్యులకు పెద్ద ఊరట లభించినట్లయింది. కాబట్టి, వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో వచ్చే ఫేక్ న్యూస్‌ను Fake News నమ్మి ఆందోళన చెందవద్దు. దేశంలో లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదు.
