Home » National » Pakistan Begging For Credits
National

Pakistan : పైకి బిల్డప్ , తెర వెనక ముష్టి ఎత్తుకుంటూ దొరికిపోయిన పాకిస్తాన్..!

Authored By
Siddhu Manchikanti
The Telugu News | Published on: April 17, 2026, 9:30 pm
Advertisement

Pakistan : పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం ఎలా తయారైందంటే.. బయటకి మాత్రం గొప్పలు చెప్పుకుంటూ లోపల మాత్రం చిల్లి గవ్వ లేక అడుక్కునే స్థితికి చేరుకుంది. స్వాతంత్య్రం వచ్చి ఎనభై ఏళ్లు గడుస్తున్నా ఆ దేశం బుద్ధి మాత్రం మారలేదు. అభివృద్ధిని గాలికొదిలేసి ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం వల్లే ఈరోజు ఆ దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అపారమైన ప్రకృతి వనరులు, సారవంతమైన భూములు ఉన్నప్పటికీ కేవలం రాజకీయ అస్థిరత, సైనిక జోక్యం, ఉగ్రవాద మూకల అండదండల వల్ల పాకిస్తాన్ ఆర్థికంగా కుదేలైంది. ఒకపక్క ప్రపంచ దేశాల ముందు తాము చాలా గొప్పవాళ్లమని బిల్డప్ ఇస్తున్నా, తెర వెనక మాత్రం సౌదీ అరేబియా, చైనా వంటి దేశాల ముందు మోకరిల్లి ముష్టి ఎత్తుకుంటోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కూడా ఇప్పుడు పాకిస్తాన్‌ను మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక ఆ దేశం తల పట్టుకుంటోంది.

Advertisement

Pakistan : పైకి బిల్డప్ , తెర వెనక ముష్టి ఎత్తుకుంటూ దొరికిపోయిన పాకిస్తాన్..!

ఇరాన్ మీద దాడి కోసం యూఏఈతో ఉన్న రక్షణ ఒప్పందాన్ని పాకిస్తాన్ అమలు చేయలేక చేతులెత్తేసింది. దీంతో ఆగ్రహించిన యూఏఈ.. తాము గతంలో ఇచ్చిన 3.5 బిలియన్ డాలర్ల రుణాన్ని వెంటనే తీర్చాలంటూ గట్టిగా ఒత్తిడి చేస్తోంది. మన కరెన్సీలో ఇది దాదాపు 32 వేల కోట్ల రూపాయలు. ఈ నెలలోనే ఈ డబ్బు చెల్లించాలని డెడ్ లైన్ పెట్టడంతో పాకిస్తాన్ పాలకులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. యూఏఈ పెడుతున్న ఈ ఒత్తిడి పాకిస్తాన్ ముసుగును తొలగించేలా చేసింది. ఒకవైపు గల్ఫ్ దేశాలతో స్నేహం అంటున్నా, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక, తీసుకున్న అప్పు తీర్చలేక ఆ దేశం పరువు బజార్లో పడింది.

Advertisement

పాకిస్తాన్ దివాలా తీయకుండా ఉండేందుకు మళ్ళీ సౌదీ అరేబియానే ఆదుకోవాల్సి వచ్చింది. ఇటీవలే సౌదీ అరేబియా 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. అందులో భాగంగా 2 బిలియన్ డాలర్లు పాక్ ఖాతాలో చేరాయి. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ కూడా అఫీషియల్‌గా వెల్లడించింది. సౌదీ ఇచ్చిన ఈ బిచ్చంతోనే యూఏఈకి కట్టాల్సిన బాకీని తీర్చాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన సౌదీలోనే పర్యటిస్తూ మరిన్ని నిధుల కోసం ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కాళ్లవేళ్ల పడుతున్నారు. మరో బిలియన్ డాలర్ల సాయం చేయాలని, పాత అప్పుల గడువు పెంచాలని ఆయన ప్రాధేయపడుతున్నారు.

Pakistan : అప్పుల కుప్పగా మారిన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ

పాకిస్తాన్ విదేశీ అప్పులు ఆ దేశ జీడీపీలో 90 శాతానికి పైగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ దేశం దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలు కేవలం 16.4 బిలియన్ డాలర్లు మాత్రమే. ఇవి మరో మూడు నెలల దిగుమతులకు కూడా సరిపోవు. ఒకవేళ యూఏఈ అప్పు గనక చెల్లిస్తే ఈ నిల్వలు మరింత పాతాళానికి పడిపోతాయి. ఐఎంఎఫ్, చైనా, సౌదీ వంటి దేశాల నుంచి అప్పులు తెచ్చి పాత అప్పులు కడుతూ కాలం వెళ్లదీస్తోంది తప్ప స్వతహాగా ఎదిగే మార్గాల గురించి ఆలోచించడం లేదు. ఇలా ప్రతిసారీ ఇతరుల ముందు చేయి చాస్తూ ముష్టి ఎత్తుకోవడం వల్ల పాకిస్తాన్‌కు ప్రపంచ వేదికపై గౌరవం లేకుండా పోయింది. ఇప్పటికైనా ఆ దేశం ఉగ్రవాదాన్ని వీడి సంస్కరణలు చేపట్టకపోతే భవిష్యత్తులో పాకిస్తాన్ అనే దేశం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

Siddhu Manchikanti

Author Bio Info : Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15+ years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి