Categories: NationalNews

sasikala : చిన్నమ్మను మళ్లీ జైలుకు పంపే స్కెచ్‌ వేస్తున్న పన్నీర్‌, పళని.. ఆమె ఓవర్‌ యాక్షన్‌ కారణం

sasikala : నాలుగు సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చినా కూడా అమ్మ వారసురాలు అంటూ చిన్నమ్మ శశికళను కొందరు తమిళ తంబీలు నెత్తిన పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు ఉన్న ఆధరణ చూసి శశికళ తానే అమ్మ నిజమైన వారసురాలిని అని, అమ్మ పార్టీ అన్నాడీఎంకే నిజమైన అధినేతను నేనే అంటూ తనకు తాను ప్రకటించింది. అన్నాడీఎంకే పార్టీ నుండి ఆమెను తప్పించినట్లుగా సీఎం ఎప్పుడో ప్రకటించాడు. పార్టీకి ఆమెకు ఎలాంటి సంబంధం లేదు అంటూ మంత్రులు మరియు అన్నాడీఎంకే నాయకులు పదే పదే చెబుతున్నారు. అయినా కూడా ఆమె అన్నాడీఎంకేను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే నాయకులు పన్నీర్‌ సెల్వం మరియు పళని స్వామిలు ఆమెను అన్నాడీఎంకే వైపుకు కూడా రాకుండా చూడాలని భావిస్తున్నారు.

panneerselvam and palaniswami planing to sasikala put in jail again

sasikala : శశికళ వల్ల ఓట్లకు గండి ఖాయం….

రాబోయే ఎన్నికల్లో అన్నా డీఎంకే మరియు బీజేపీలు కలిసి ముందుకు వెళ్లేందుకు చర్చలు జరుపుతున్నాయి. కాస్త కష్టపడితే ఖచ్చితంగా అధికారంలోకి రావచ్చు అంటూ ఈ కూటమి భావిస్తుంది. ఇలాంటి సమయంలో శశికళ రూపంలో అన్నాడీఎంకేకు గండి పడే అవకాశం ఉంది. దాంతో ఆమెను రాజకీయాలకు దూరంగా ఉంచే ఉద్దేశ్యంతో సీఎం మరియు డిప్యూటీ సీఎం అయిన పళ్లని మరియు పన్నీర్‌ లు మాస్టర్ ప్లాన్‌ వేశారు. తమిళ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆమె పాత కేసులను తవ్వి మళ్లీ ఆమెను కనీసం ఒక్క ఏడాది అయినా జైలుకు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఢిల్లీలో మోడీతో శశికళ విషయం చర్చ…

శశికళను జైలుకు పంపించేందుకు గాను ఈ తంబీలు ఇద్దరు కూడా ప్రధాని నరేంద్ర మోడీ సాయంను తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో ఢిల్లీలో అన్నాడీఎంకే పార్టీ కార్యలయం జరుగబోతుంది. ఆ కార్యాలయం ఓపెనింగ్ కు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు అవ్వబోతున్నారు. ఆ సమయంలో పళని మరియు పన్నీర్‌ లు మోడీతో శశికళ విషయం ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు. ఆమె ఏ మేరకు ప్రభావం చూపించబోతుంది అనే విషయాన్ని కూడా ప్రధానికి విన్నవించే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి ఏదో ఒక కేసులో మళ్లీ శశికళను అడ్డు తప్పించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని అంటున్నారు. ఆమె జైలు నుండి విడుదలై చెన్నై వచ్చిన సమయంలో జరిగిన డ్రామా, ఆ సమయంలో ఆమె చూపించిన ఓవర్‌ యాక్షన్ కారణంగానే వారికి కోపం వచ్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Recent Posts

Vastu Tips | హిందూ మతంలో రావి చెట్టు ప్రాధాన్యం .. ఇంటి గోడలపై పెరిగితే శుభమా, అశుభమా?

Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…

1 minute ago

Urea : ఆంధ్ర యూరియా తెలంగాణకు వస్తుందట..వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు

Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…

9 hours ago

Allu Aravind : అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్..వెంటనే కూల్చేయాలని ఆదేశాలు

Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…

10 hours ago

Malla Reddy Key Comments on CBN : చంద్రబాబు పై మల్లన్న ప్రశంసలు..సైకిల్ ఎక్కేందుకేనా..?

Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…

11 hours ago

Kavitha : కేసీఆర్ బాటలో వెళ్తునంటున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…

12 hours ago

Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్

Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్‌-జెడ్‌ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…

13 hours ago

Apple Event | ఆపిల్‌ ఈవెంట్‌ 2025: ఐఫోన్‌ 17 సిరీస్‌ లాంచ్‌కు సిద్ధం.. నాలుగు కొత్త మోడల్స్‌, ఆధునిక ఫీచర్లతో ప్రదర్శన

Apple Event | ఐఫోన్‌ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన…

14 hours ago

Group 1 | గ్రూప్-1 మెయిన్స్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు .. మెరిట్ లిస్ట్ రద్దు, రీవాల్యుయేషన్ లేదా తిరిగి పరీక్షలు

Group 1 | గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…

15 hours ago