Viral video : ఆర్భాటానికి కొత్త అర్థం .. వధూవరులపై రూ. 8.5 కోట్ల నోట్ల వర్షం.. ఎక్కడో తెలుసా..?

 Authored By suma | The Telugu News | Updated on :18 February 2026,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Viral video : వధూవరులపై రూ. 8.5 కోట్ల నోట్ల వర్షం.. ఎక్కడో తెలుసా..?

Viral video : పెళ్లి వేడుకలు అంటే ఆనందం, ఆర్భాటం, ఆతిథ్యం. అయితే పంజాబ్‌లో జరిగిన ఒక పెళ్లి వేడుక మాత్రం అపూర్వ ఘట్టంగా నిలిచింది. సాధారణంగా పెళ్లిళ్లలో పూల వర్షం కురిపించడం చూస్తాం. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా కోట్ల రూపాయల నగదును వరుడు–వధువులపై కురిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సంఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Rs. 8.5 crores of notes showered on bride and groom in Punjab..

Viral video : ఆర్భాటానికి కొత్త అర్థం .. వధూవరులపై రూ. 8.5 కోట్ల నోట్ల వర్షం.. ఎక్కడో తెలుసా..?

Viral video : బ్యాగుల కొద్దీ నగదు… అబ్బురపరిచిన అతిథులు

పంజాబ్‌కు చెందిన ఓ ధనిక కుటుంబం తమ ఇంటి పెళ్లిని అత్యంత ఘనంగా నిర్వహించింది. వేడుకలో భాగంగా బంధువులు, స్నేహితులు బ్యాగుల కొద్దీ కరెన్సీ నోట్లను తీసుకువచ్చారు. ఆ తరువాత వరుడు–వధువులు వేదికపై కూర్చుని ఉండగా వారిపై ఏకంగా రూ. 8.5 కోట్ల నగదును కురిపించినట్లు సమాచారం. అక్కడున్న అతిథులు ఈ దృశ్యాన్ని చూసి విస్తుపోయారు. వేదికపై నోట్ల గుట్టలు పేరుకుపోయాయి. ఆ తర్వాత వరుడు ఆమె చేతిని పట్టుకుని నవ్వుతూ కనిపించాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు..అతిగా ఉందని, పేదలకు, నిస్సహాయులకు ఆ డబ్బుని ఉపయోగించి ఉంటే బాగుండేదంటూ విమర్శించారు. కానీ కొందరూ..ఈ తంతు చూస్తే..అతడి కుటుంబం ఆమెని బాగా చూసుకుంటుందని ఆశిస్తున్నా అయినా ఇది వారి డబ్బు..కాబట్టి నచ్చినట్లు ఖర్చుపెట్టుకుంటారని సపోర్టు చేస్తూ పోస్టులు పెట్టారు. ఈ ఘటనను అక్కడున్న వారు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది.

Viral video : ఆర్భాటానికి కొత్త అర్థం

పంజాబ్‌లో పెళ్లిళ్లు అంటేనే వైభవానికి ప్రతీకగా భావిస్తారు. సంగీత్, మెహందీ, రిసెప్షన్ వంటి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. అయితే ఈ పెళ్లి మాత్రం ఆర్భాటానికి కొత్త నిర్వచనం ఇచ్చిందని చెప్పాలి. ఇంత పెద్ద మొత్తంలో నగదును కురిపించడం అరుదైన విషయం అని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ సంఘటనపై కొందరు విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నారు. డబ్బును ఈ విధంగా ప్రదర్శించడం సమాజానికి మంచి సందేశం కాదని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం కుటుంబ సంపన్నతను ఆనందాన్ని వ్యక్తపరచే విధానం ఇదేనని అంటున్నారు.

Viral video : సోషల్ మీడియాలో చర్చనీయాంశం

ఈ నోట్ల వర్షం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది. కొందరు దీన్ని “రాయల్ వెడ్డింగ్”గా అభివర్ణిస్తుంటే మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లలో కొత్త ట్రెండ్ మొదలైందా? లేక ఇది ఒక్కసారిగా జరిగిన అరుదైన ఘటనామా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా ఈ పెళ్లి వేడుక మాత్రం నోట్ల వర్షంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వరుడు–వధువులకు జీవితాంతం గుర్తుండిపోయే ఘట్టంగా ఇది నిలిచిపోవడం ఖాయం.

suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి