PM Kisan : రైతులకు షాకింగ్‌ న్యూస్‌ .. పీఎం కిసాన్ నిధుల పై ఈ రాష్ట్రాల్లో కేంద్రం కొత్త రూల్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

PM Kisan : రైతులకు షాకింగ్‌ న్యూస్‌ .. పీఎం కిసాన్ నిధుల పై ఈ రాష్ట్రాల్లో కేంద్రం కొత్త రూల్ ..!

 Authored By suma | The Telugu News | Updated on :25 February 2026,5:00 pm

ప్రధానాంశాలు:

  •  PM Kisan : రైతులకు షాకింగ్‌ న్యూస్‌ .. పీఎం కిసాన్ నిధుల పై ఈ రాష్ట్రాల్లో కేంద్రం కొత్త రూల్ ..!

PM Kisan : కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. వివరాల ప్రకారం 22వ విడత కింద ప్రతి అర్హత కలిగిన రైతు ఖాతాలో రూ.2,000 చొప్పున జమ చేయనున్నారు. ఈనిధులు హోలీ పండుగకు ముందే అందుతాయని కేంద్రం సూచించింది. గతంలో నిధుల విడుదలలో ఆలస్యం కావడంతో రైతులలో నిరాశ వ్యక్తమైంది. ఈసారి ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో నిధులు ఖాతాల్లోకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

PM Kisan రైతులకు షాకింగ్‌ న్యూస్‌ పీఎం కిసాన్ నిధుల పై ఈ రాష్ట్రాల్లో కేంద్రం కొత్త రూల్

PM Kisan : రైతులకు షాకింగ్‌ న్యూస్‌ .. పీఎం కిసాన్ నిధుల పై ఈ రాష్ట్రాల్లో కేంద్రం కొత్త రూల్ ..!

PM Kisan : పీఎం కిసాన్ పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ అవసరమా?

రైతులు ఈ సమయంలో పెద్ద సందేహంలో ఉన్నారు. పీఎం కిసాన్ కోసం ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేయాలి కాబోయే నిబంధనలు కారణంగా గందరగోళం ఏర్పడింది. ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ పొందకపోతే పీఎం కిసాన్ నిధులు ఆగిపోతాయా అన్న అనుమానం కూడా రాకొచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది కొత్త ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవసరం 14 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ ఈ 14 రాష్ట్రాల్లోని రైతులు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు కావాల్సి ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో ఈ రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

PM Kisan : ఈకేవైసీ మరియు రిజిస్ట్రీ ప్రక్రియ

కేంద్రం లబ్ధిదారులను నిర్ధారించడానికి ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా చేసుకుంది. రైతులు కామన్ సర్వీసెస్ సెంటర్ (CSC) కి వెళ్లి ఈకేవైసీ పూర్తి చేయాలి. అదనంగా, పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్ ద్వారా కూడా స్వయంగా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. 2019 ఫిబ్రవరి 1 తర్వాత ల్యాండ్ యాజమాన్య హక్కులు పొందిన రైతులు ఈ పథకానికి అర్హులు కాదు. అందుకే, పీఎం కిసాన్ పోర్టల్ లోకి వెళ్లి “నో యూర్ స్టేటస్” ను క్లిక్ చేసి అర్హుల జాబితాను తనిఖీ చేసుకోవచ్చు. జాబితాలో మీ పేరు ఉంటే, ఖాతాలో నిధులు తక్షణమే జమ అవుతాయి. ఈ పథకం ద్వారా కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది ప్రతి అర్హత కలిగిన రైతుకు నేరుగా ఆర్థిక సాయం అందించడం. ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ మరియు ఈకేవైసీ ప్రక్రియ ద్వారా నిధులు తప్పనిసరిగా సరైన వ్యక్తికి చేరుతాయని కేంద్రం పేర్కొంది. రైతులు ఈ సూచనలను పాటించడం ద్వారా హోలీకి ముందే నిధులు పొందే అవకాశాన్ని ఖరారు చేసుకోవచ్చు.

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది