కీచక లేడి .. ఇలాంటి పోలీసులతో జాగ్రత్త...!
ఈరోజుల్లో చాలామంది కష్టపడకుండా డబ్బులు సంపాదిస్తున్న వారు చాలా ఎక్కువ అయిపోయారు. ఎక్కువగా పని లేకుండా ఈజీగా డబ్బులు సంపాదించే మార్గాలను వెతుకుతున్నారు. మోసం చేయకుండా ఇలా చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు కానీ నేటి రోజుల్లో కొందరు మాత్రం ఇలాంటి పనులు చేస్తూ సైబర్ నేరాలకి పాల్పడుతున్నారు. ఈజీ మనీ కోసం ఎంతకైనా తెగిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అచ్చం ఎవరు ఊహించని దారుణానికే పాల్పడింది ఓ మహిళ. అసలు విషయం బయటకు రావడంతో ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు.
పోలీసుల కథనం ప్రకారం తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ కి చెందిన విజయలక్ష్మి అనే మహిళ ఈజీ మనీ కోసం అలవాటు పడింది. గతంలో ఇలాంటి పనులు చేసి చివరికి చేతులు కాల్చుకుంది. ఇలా కాదని గమనించిన మహిళ ఎవరు ఊహించని విధంగా దారుణానికి పాల్పడి పోలీసులకు చిక్కింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే డబ్బుల కోసం ఏకంగా ఎస్పీ అవతారం ఎత్తింది. అనంతపురం జిల్లా ఎస్పీ కేకే అన్హు రాజన్ ఫోటోను ప్రొఫైల్ గా పెట్టుకుంది. ఇటీవల అనంతపురం రూరల్ పరిధిలో పట్టణ సీఐ కి చాట్ చేసింది.
నేను పని మీద వచ్చాను అని, అర్జెంట్గా నాకు డబ్బులు పంపించండి అని పదేపదే వాట్స్అప్ మెసేజ్లు చేసింది. ఇక పోలీసులు ఇదంతా నిజమే అనుకున్నారు. ఎందుకో సిఐ లకి అనుమానం వచ్చింది. అప్రమత్తమై అన్ని కోణాలలో దర్యాప్తు చేయగా డబ్బుల కోసం మహిళ ఇలాంటి కీచక పనులు చేస్తుందని పోలీసులు తెలుసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆమె అడ్రస్ ను తెలుసుకొని ఎట్టకేలకు విజయలక్ష్మి అని తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మహిళ ఏకంగా ఎస్పి డీపీ పెట్టుకొని మోసం చేయాలని ప్రయత్నం చేయడంతో పోలీసులు షాక్ అవుతున్నారు
భర్త ప్రాణాలు రక్షించేందుకు తన అవయవాన్ని దానం చేసిన ఓ భార్య... చివరకు ప్రాణాన్ని కోల్పోయిన విషాదకర ఘటన మహారాష్ట్రలోని…
Health Tips | వేరుశెనగలు మనందరికీ ఎంతో ఇష్టమైన ఆహార పదార్థం. వీటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మరియు ఇతర…
Heart Attack | ఇటీవల కాలంలో గుండెపోటు సమస్యలు వృద్ధులతో పాటు యువతలోనూ తీవ్రమవుతున్నాయి. తక్కువ వయస్సులోనే అనేకమంది గుండెపోటు బారినపడి…
Moong Vs Masoor Dal | భారతీయ వంటకాల్లో పప్పు ధాన్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి పోషకాలతో నిండి ఉండటంతోపాటు…
Health Tips | చర్మాన్ని సూర్యకిరణాల నుండి కాపాడేందుకు సన్‌స్క్రీన్‌ను ప్రతి రోజు వాడాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తుంటారు.…
Health Tips | కాలానికి అతీతంగా ఆరోగ్యాన్ని బలోపేతం చేసే పానీయాల గురించి మాట్లాడుకుంటే కొబ్బరి నీరు మరియు నిమ్మకాయ…
vinayaka chavithi| వినాయక చవితి సందర్భంగా మోదకాలను ఇంట్లో తయారుచేసి శ్రీ గణేశుడికి నివేదించడం జరుగుతుంది… అలా చేస్తే రుచి,…
Credit Card Using : పండుగల సందర్భంగా, లేదా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో జరిగే సేల్స్‌లో చాలా…
This website uses cookies.