Home » Exclusive » Wed Couple Cast Their Vote
Exclusive

Vote : పెళ్లి క‌న్నా ఓటు ముఖ్యం.. పెళ్లి బట్టలతోనే పోలింగ్ కేంద్రానికి వచ్చిన పెళ్లి కూతురు.. వీడియో !

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: April 19, 2024, 2:00 pm
Advertisement

Vote : లోక్‌సభ సమరానికి తెరలేసింది. ఏడు విడతల్లో జరిగే సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఈ రోజు ప్రారంభం అయింది. తొలి విడతలో 102 లోక్‌సభ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మొత్తం 16 కోట్ల 63 లక్షలమంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఎండ‌లు మండుతున్నా కూడా ముస‌లి వాళ్లు, మ‌హిళ‌లు ప్ర‌తి ఒక్క‌రు కూడా ఓటు వేసేందుకు వ‌స్తున్నారు. కాసిమేడు ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన వారం రోజుల వయసున్న చిన్నారితో పాటు ఓటు వేయడానికి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఓటు వేయడం ప్రతీ ఒక్కరి విధి అని, ప్రతీ ఒక్కరూ తమ భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ఓటు వేయాలంటూ ఆ మ‌హిళ‌ పిలుపునిచ్చారు..

Advertisement

Vote : ఓటు ఫ‌స్ట్‌.. త‌ర్వాత ఏదైన‌

ఇక ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్‌కి చెందిన‌ దీప అనే అమ్మాయి పెళ్లి బట్టలతోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంది. ఓటు వేసిన అనంతరం అందరూ ఓటు వేయాలని వధువు విజ్ఞప్తి చేశారు. దేశం, తమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ఓటు వేయాలని వధువు అన్నారు. అలానే జమ్మూ మరియు కాశ్మీర్‌లోని కథువా మొత్తం పెళ్లి ఊరేగింపుతో పాటు ఓటు వేయడానికి వ‌చ్చి సంద‌డి చేశారు. ఒకవైపు పెళ్లి ప‌నుల‌తో బిజీగ ఉంటున్న చాలా మంది వ‌చ్చి ఓటు వినియోగించుకుంటున్నారు.తొలి విడతలో 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు రాజకీయ నేతలు, ప్రముఖులు.

Vote : పెళ్లి క‌న్నా ఓటు ముఖ్యం.. పెళ్లి బట్టలతోనే పోలింగ్ కేంద్రానికి వచ్చిన పెళ్లి కూతురు..!

Advertisement

శివగంగలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి విడతలో అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, రాజస్థాన్‌, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్ఛిమ బెంగాల్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులతో సహా కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూ కశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరి లలో ఎన్నికలు జరుగతున్నాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి