ganguly : 2014లో మోడీ ప్రధానిగా అయిన తర్వాత బీజేపీని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ రావడం అసాధ్యం అనుకుంటే అక్కడ మోడీ మరియు షాలు కలిసి బీజేపీ జెండా ఎగురవేశారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో బీజేపీ జెండా రెపరెపలాడుతున్న సమయంలో కూడా పశ్చిమ బెంగాల్ లో మాత్రం వారికి పరాభవం తప్పలేదు. ఈసారి బీజేపీ మళ్లీ బెంగాల్ లో జెండా పాతేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికలు మరో ఏడాది ఉండగానే అక్కడ రాజకీయ వేడి మొదలైంది. ముందస్తు ప్రణాళికలు వేస్తూ వచ్చిన షా మరియు మోడీలు బీసీసీఐ ప్రెసిడెంట్ గా బెంగాల్ ప్రిన్స్ అంటూ పేరు దక్కించుకున్న గంగూలీని చేయడం జరిగింది.
గంగూలీ ప్రభావం ఖచ్చితంగా బెంగాల్ లో ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందుకే బెంగాల్ రాజకీయాల్లోకి ఆయన్ను తీసుకు వచ్చేందుకు ఒక వైపు మమత మరో వైపు బీజేపీ వారు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ వారు గంగూలీకి బీసీసీఐ చీఫ్ పదవి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆయన ఆరోగ్యం సరిగా లేదు. అయినా కూడా ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా అయినా గంగూలీని బీజేపీకి సహకరించేలా చేయాలని ప్రధాని మోడీ మరియు అమిత్ షాలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మమత బెనర్జీ బెంగాల్ గడ్డపై సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ సారి మాత్రం ఆమెకు కాస్త కష్టంగా అనిపిస్తుంది. అయినా కూడా ప్రజల అండదండలు ఉన్న కారణంగా ఖచ్చితంగా తానే గెలుస్తాను అంటూ నమ్మకంగా ఉంది. ఇలాంటి సమయంలో గంగూలీని రంగంలోకి దించితే మాత్రం ఫలితాలు తారు మారు అయ్యే అవకాశం ఉంది. గంగూలీ మాత్రం ఇప్పటి వరకు రాజకీయంగా మాట్లాడేందుకు ఆసక్తిని కనబర్చడం లేదు. ఇప్పటి వరకు అమిత్ షా మరియు మోడీలపై ప్రశంసలు అయితే కురిపిస్తున్నాడు. కాని ఇప్పటి వరకు బీజేపీకి తన మద్దతు అని మాత్రం చెప్పలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో గంగూలీ మద్దతు ఎవరికి అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మోడీ మరియు షాలు ఒత్తిడి చేసి అయినా గంగూలీతో బీజేపీకి మద్దతు తెలిపేలా చేసే అవకాశం ఉందంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.