ganguly : మోడీ, షా వ్యూహం ఫలించిందా.. బెంగాల్‌ రాజకీయాల్లో గంగూలీ కీలక పాత్ర కానున్నాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ganguly : మోడీ, షా వ్యూహం ఫలించిందా.. బెంగాల్‌ రాజకీయాల్లో గంగూలీ కీలక పాత్ర కానున్నాడా?

 Authored By himanshi | The Telugu News | Updated on :1 March 2021,3:30 pm

ganguly : 2014లో మోడీ ప్రధానిగా అయిన తర్వాత బీజేపీని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ రావడం అసాధ్యం అనుకుంటే అక్కడ మోడీ మరియు షాలు కలిసి బీజేపీ జెండా ఎగురవేశారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో బీజేపీ జెండా రెపరెపలాడుతున్న సమయంలో కూడా పశ్చిమ బెంగాల్‌ లో మాత్రం వారికి పరాభవం తప్పలేదు. ఈసారి బీజేపీ మళ్లీ బెంగాల్‌ లో జెండా పాతేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికలు మరో ఏడాది ఉండగానే అక్కడ రాజకీయ వేడి మొదలైంది. ముందస్తు ప్రణాళికలు వేస్తూ వచ్చిన షా మరియు మోడీలు బీసీసీఐ ప్రెసిడెంట్ గా బెంగాల్ ప్రిన్స్ అంటూ పేరు దక్కించుకున్న గంగూలీని చేయడం జరిగింది.

west bengal assembly elections ganguly may join bjp

west bengal assembly elections ganguly may join bjp

ganguly : బీజేపీకి మద్దతు ఇవ్వాలనే గంగూలీకి పదవి..

గంగూలీ ప్రభావం ఖచ్చితంగా బెంగాల్ లో ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందుకే బెంగాల్ రాజకీయాల్లోకి ఆయన్ను తీసుకు వచ్చేందుకు ఒక వైపు మమత మరో వైపు బీజేపీ వారు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ వారు గంగూలీకి బీసీసీఐ చీఫ్‌ పదవి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆయన ఆరోగ్యం సరిగా లేదు. అయినా కూడా ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్‌ గా అయినా గంగూలీని బీజేపీకి సహకరించేలా చేయాలని ప్రధాని మోడీ మరియు అమిత్ షాలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మమతకు గంగూలీ భయం..

మమత బెనర్జీ బెంగాల్‌ గడ్డపై సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ సారి మాత్రం ఆమెకు కాస్త కష్టంగా అనిపిస్తుంది. అయినా కూడా ప్రజల అండదండలు ఉన్న కారణంగా ఖచ్చితంగా తానే గెలుస్తాను అంటూ నమ్మకంగా ఉంది. ఇలాంటి సమయంలో గంగూలీని రంగంలోకి దించితే మాత్రం ఫలితాలు తారు మారు అయ్యే అవకాశం ఉంది. గంగూలీ మాత్రం ఇప్పటి వరకు రాజకీయంగా మాట్లాడేందుకు ఆసక్తిని కనబర్చడం లేదు. ఇప్పటి వరకు అమిత్‌ షా మరియు మోడీలపై ప్రశంసలు అయితే కురిపిస్తున్నాడు. కాని ఇప్పటి వరకు బీజేపీకి తన మద్దతు అని మాత్రం చెప్పలేదు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన నేపథ్యంలో గంగూలీ మద్దతు ఎవరికి అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మోడీ మరియు షాలు ఒత్తిడి చేసి అయినా గంగూలీతో బీజేపీకి మద్దతు తెలిపేలా చేసే అవకాశం ఉందంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది