
Ram charan about Chiarnjeevi on Acharya set
Ram charan : మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబోలో ఆచార్య సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. ఇందులో రకరకాల ట్విస్ట్‌ల తరువాత రామ్ చరణ్ ఓ పాత్రను వేసేందుకు సెట్‌లొ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సిద్ద అనే పాత్రలో చెర్రీ నటించబోతోన్నాడని, సెట్‌లో అడుగుపెట్టిన ఓ స్టిల్‌ను షేర్ చేశారు. అయితే ఇప్పుడు చిరంజీవి, చరణ్ కాంబోలో సీన్స్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతంలోనే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.
Ram charan about Chiarnjeevi on Acharya set
మారెడుమిల్లి, ఖమ్మం అటవీ ప్రాంతాల సరిహద్దుల్లో ఆచార్య షూటింగ్ జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి రామ్ చరణ్ ఓ స్టిల్‌ను షేర్ చేశాడు. ఇందులో రామ్ చరణ్ చెప్పిన మాటలు, వదిలిన హింట్లు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఏ కామ్రేడ్ మూమెంట్ అంటూ రామ్ చరణ్ చెప్పిన మాటలు చూస్తుంటే.. ఈ ఇద్దరూ ఇందులో నక్సలైట్ పాత్రలను పోషిస్తోన్నట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా రామ్ చరణ్ వదిలిన పోస్టర్లో గన్నులు కూడా ఉన్నాయి.
ఇక ఇదే పోస్టర్‌ను కొరటాల శివ షేర్ చేస్తూ.. ఆచార్య సిద్దమవుతున్నాడు అనే క్యాప్షన్ పెట్టాడు. ఇక డాడీతో నటిస్తుంటే ప్రతీ మూమెంట్‌ను ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తోందని చెర్రీ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఇలా చడీ చప్పుడు లేకుండా పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. మహా శివరాత్రికి ఏదైనా సర్ప్రైజ్ ఉందేమో అని ఫ్యాన్స్ సంబరపడిపోతోన్నారు. సమ్మర్ కానుకగా మే 13న ఆచార్య సినిమా విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.