సముద్ర గర్భంలో లక్షల కోట్ల సంపద.. గుర్తించిన పరిశోదకులు రెండు నౌకల్లో బయటపడ్డ నిధులు
సముద్రాల్లో ఎన్నో నిధులు నిక్షిప్తమై ఉంటాయి. ప్రపంచంలో యుద్దాలు జరిగిన సమయంలో విలువైన సంపద తీసుకెళ్లే షిప్ లు మునిగిపోవడం వంటివి జరుగుతుంటాయి. అవి ఇప్పటికీ అలాగే ఉంటాయి. సముద్రాల్లో ఇప్పటికే చాలా చోట్ల ఇలాంటివి గుర్తించారు. మునిగిపోయిన నౌకల శకలాలు గుర్తించి ఆవి ఏ కాలంలో ప్రమాదానికి గురయ్యాయో శాస్త్రవేత్తలు గుర్తిస్తుంటారు. అయితే ప్రస్తుతం సముద్రంలో మునిగిపోయిన రెండు నౌకల్లో లక్షల కోట్ల సంపద ఉన్నట్లు పురావస్తు శాఖ పరిశోదకులు గుర్తించారు. కొన్ని వందల ఏళ్ల క్రితం బ్రిటీష్ వారు ముంచేసిన ఓ నౌక శకలాలను గుర్తించారు.అంతే కాకుండా ఆ నౌక పక్కనే ఉన్న మరో రెండు నౌకల శకలాలు కూడా గుర్తించారు.
అయితే ఈ రెండు నౌకల్లో అత్యంత విలువైన సంపద ఉందని నిర్ధారించారు. అయితే 1708 లో స్పెయిన్ నేవీకి చెందిన యుద్ద నౌక శాన్ జోస్ ను బ్రిటీష్ సైన్యం కూల్చివేసింది. ఈ నౌకను 2015లో కొలంబియా వద్ద కరేబిన్ సముద్రంలో 3,100 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ నౌకకు పక్కనే మరో రెండు నౌకలు కూడా కూల్చివేయబడి ఉన్నట్లు గుర్తిచారు. ఇక ఈ రెండు నౌకల్లో బంగారం భారీగా ఉన్నట్లు నిర్దారించారు. కాగా ఇటీవల ఈ రెండు నౌకలకు చెందని పుటేజీని స్పెయిన్ ప్రభుత్వం విడుదల చేసింది. మార్కెట్ విలువ ప్రకారం ఆ సంపద విలువ సుమారు రూ.1.27 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ నౌకల వద్దకు రిమోట్ కంట్రోల్ తో నడిచే ఓ వాహనాన్ని పంపి పరిశీలించి ఫొటోలు సేకరించారు. కాగా దాదాపు 200 ఏళ్ల క్రితమే ఈ నౌకలు మునిగినట్లుగా చెబుతున్నారు. ఈ నౌకల శిథిలాలలో బంగారు నాణేలు, పింగాణీ పాత్రలు, వెండి పాత్రలు, ఫిరంగులు బయటపడినట్లు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ సంపద ఎవరు తీసుకోవాలో అనేదానిపై వివాదాలు చలరేగుతున్నాయి. ఓ వైపు బోలివియా స్థానిక ప్రజలు తమ వారసత్వ సంపదగా చెబుతుంటే స్పెయిన్ తమ నౌకలని అంటోంది. ఇక కొలంబియా అధికారులు సాంస్కృతిక, వారసత్వ సంపద కాబట్టి నౌకల శిథిలాలతో మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.