Today Gold Rates : మహిళలకు తీపి కబురు.. బంగారం త్వరగా కొనేయండి.. తెలుగు రాష్ట్రాల్లో ధరలెంటో తెలుసా..?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 11, 2022, 8:24 am

Today Gold Rates : గత వారం రోజులుగా పసిడి ప్రియులకు మంచి రోజులు నడుస్తున్నాయి. బంగారం కొనేవారికి మంచి రోజులు కనిపిస్తున్నాయి. నాలుగు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉండటమో లేక తగ్గుతూనో వస్తున్నాయి. నిన్న బంగారం ధర స్వల్పంగా పెరగగా… నేడు పలు ప్రాంతాల్లో భారీగా తగ్గింది. దీంతో బంగారం కొనే వారికి ఈ మేరకు నేడు కాస్త ఊరట లభించే విధంగా ఉంది. దేశవ్యాప్తంగా వివధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది.

ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46, 760 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51, 010 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46, 610 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48, 610 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44, 500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48, 550 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44, 500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48, 550 గా ఉంది.

2022 january 11 today gold rates in telugu states

2022 january 11 today gold rates in telugu states

బంగారం ధరలు ఇలా ఉండగా నేడు వెండి ధరల్లో కూడా మార్పు కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే మార్కెట్లో నేడు కేజీ సిల్వర్ ధర రూ. 300 తగ్గింది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 64, 300 గా ఉండగా… ఢిల్లీ, ముంబయిలలో నిన్నటితో పోలిస్తే రూ. 300 తగ్గి రూ. 60, 4000 గా ఉంది.

అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోద వుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా తగ్గుతున్న ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు. ఏది ఏమైనా పసిడి ప్రియులకు ఇది కాస్త ఊరటనిచ్చే అంశమే.

 

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp