Today Gold Rates : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలివే..?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 14, 2022, 9:50 am

Today Gold Rates : గత వారం రోజులుగా మహిళలకు మంచి రోజులు నడుస్తున్నాయి. బంగారం కొనాలనుకునే మగువలకు మంచి రోజులు కనిపిస్తున్నాయి. నాలుగు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉండటమో లేక తగ్గుతూనో వస్తున్నాయి. నిన్న బంగారం ధర స్వల్పంగా తగ్గగా… నేడు పలు ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగింది. దేశవ్యాప్తంగా వివధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది.ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46, 970 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51, 230 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 110 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49, 110 గా ఉంది.

ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 010 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 010 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45, 010 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,010 గా ఉంది.బంగారం ధరలు ఇలా ఉండగా నేడు వెండి ధరల్లో మార్పు కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే మార్కెట్లో నేడు కేజీ సిల్వర్ ధర కాస్త పెరిగింది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 65, 900 గా ఉంది.

2022 january 14 Today Gold Rates in Telugu states


2022 january 14 Today Gold Rates in Telugu states

అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp