Home » Exclusive » 2022 January 16 Today Corona Updates In India
Exclusive

Today Covid Update : బ్రేకింగ్.. భారత్ లో కరోనా ప్రళయం.. ఒక్కరోజే 2,71,202 కరోనా కేసులు..!

Authored By
Inesh A
The Telugu News | Updated on: January 16, 2022, 9:50 am
Advertisement

భారత్ లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ఒక వైపు ఒమిక్రాన్‌ కేసులు, మరో వైపు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 2 లక్షల 71 వేల 202 కేసులు నమోదయ్యి తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. మహమ్మరితో తాజాగా 314 మంది మృత్యువాత పడ్డారు. ఇక డైలీ పాజిటివీటి రేటు 16.28 శాతంగా నమోదు చేసుకుంది. దేశంలో ప్రస్తుతం 15, 50, 377 యాక్టిివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

మరోవైపు రోజు వందల సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7, 743కు చేరుకుంది. తాజాగా 1, 38, 331 మహమ్మారి నుంచి కోలుకున్నారు. అధిక శాతం కేసులు మహరాష్ట్ర చూశాయి. దేశంలో ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తూ గజ గజ లాడిస్తోంది. మూడో వేవ్ కి ఇదే ప్రారంభమని ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటివరకైతే ప్రమాదం కాదని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది. ఒమిక్రాన్‌ భారిన పడ్డ బాధితులకు… జలుబు, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు ఉండి త్వరగా కోలుకుంటున్నట్లు పేర్కొంటున్నారు.

2022 january 16 today corona updates in india

Advertisement

అయినప్పటికీ ప్రతీ ఒక్కరూ మాస్క్, శానిటైజర్‌, భౌతికదూరం వంటి నియమాలను తప్పక పాటించాలని సూచిస్తున్నారు. గత వారం రోజులుగా లక్షకు పైగా నమోదు అవుతూ వస్తున్న కరోనా కేసులు నేడు విపరీతంగా 2 లక్షలకు పైగా పెరుగుతుండటం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.

Inesh A

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి