Home » Exclusive » 2022 January 19 Today Corona Updates In India
Exclusive

Today Covid Update : దేశంలో కరోనా ప్రళయం.. ఒక్కరోజే 2,82,970 కొవిడ్ కేసులు..441 మరణాలు.!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 19, 2022, 9:45 am
Advertisement

Today Covid Update : దేశంలో నిన్న కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు నేడు మళ్ళీ పుంజుకున్నాయి. దేశవ్యాప్తంగా నిన్నటితో పోలిస్తే నేడు కేసులు భారీగా నమోదయ్యాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 2 లక్షల 82 వేల 970 కేసులు నమోదయ్యి… మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. మహమ్మరితో తాజాగా 441 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రికవరీ రేటు 94.09% కాగా.. మరణాల రేటు 1.29%గా ఉంది.కోవిడ్ టెస్టుల పాజిటివిటీ రేటు 15. 13% శాతానికి పెరిగింది.

Advertisement

దేశంలో ప్రస్తుతం 18, 31, 000 యాక్టిివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రోజు వందల సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8, 961కు చేరుకుంది. తాజాగా 1, 88, 157 మహమ్మారి నుంచి కోలుకున్నారు. అయితే దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తూ గజ గజ లాడిస్తోంది. అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటివరకైతే ప్రమాదం కాదని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది.

Karthika Deepam Serial ToDay Episode What is going to happen

Advertisement

ఏది ఏమైనప్పటికీ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ విధించాయి. తమిళనాడు, జమ్ముకాశ్మీర్ లో వీకెండ్ లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రతీ ఆదివారం లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఏపీతో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కేసుల సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ మేరకు ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పక పాటించాలని హెచ్చరిస్తున్నాయి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి