Today Gold Rates : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలెంతో తెలుసా.!

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 24 January 2022, 8:20 am

Today Gold Rates : పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం కొనాలనుకునే మగువలకు మార్కెట్లో నేడు గుడ్ న్యూస్ వినిపిస్తోంది. గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధరలు నిన్న కాస్త మార్పు చోటు చేసుకోగా.. పలు ప్రాంతాల్లో నేడు బంగారం ధరలు మళ్ళీ కాస్త తగ్గాయి. దేశవ్యాప్తంగా వివధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది. ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే..

ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 790 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52, 090 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 520 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49, 520 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 490 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 630 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45, 490 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49, 630 గా ఉంది.

2022 january 24 today gold rates in telugu states

2022 january 24 today gold rates in telugu states

బంగారం ధరలు ఇలా ఉండగా నేడు వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర నిన్నటిలాగే రూ. 69, 000 గా ఉంది. అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు

Advertisement

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి