Home » National » 2022 January 26 Today Gold Rates In Telugu States
National

Today Gold Rates : మ‌హిళ‌లకు గుడ్‌న్యూస్‌.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలివే.!

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: January 26, 2022, 8:30 am
Advertisement

Today Gold Rates : గత కొద్ది రోజులుగా భారీగా తగ్గి ఆ తర్వాత స్థిరంగా ఉంటూ వస్తున్న బంగారం ధరల్లో మళ్ళీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో నిన్న బంగారం ధరలు మళ్ళీ తగ్గగా నేడూ మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో తగ్గి.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాస్త పెరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది.ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే.. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.45, 750 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50, 000 గా ఉంది.

Advertisement

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46, 750 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49, 680 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 750 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 910 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45, 750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49, 910 గా ఉంది.బంగారం ధరలు ఇలా ఉండగా నేడు వెండి ధరలు మాత్రం మార్పు కనిపిస్తోంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 800 తగ్గి ప్రస్తుతం మార్కెట్ లో రూ. 68, 200 గా ఉంది.

2022 january 26 today gold rates in telugu states

Advertisement

అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి