tollywood heroines who have ruined their careers
Heroines : తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లకు గ్లామర్‌తో పాటు నటనా, చమత్కారం, కొన్ని సార్లు దూకుడుతో పాటు తగ్గడం కూడా తెలిసి ఉండాలి. అప్పుడే వారికి వరుసగా ఆఫర్లు వస్తుంటాయి. లేకపోతే వారికి కెరీర్ నీటి బుడగ లాగా పేలిపోతుంది. వీటన్నింటి కంటే సక్సెట్ రేటు ఎంతో ముఖ్యం. అందుకోసం మంచి కథలను ఎంపిక చేసుకునేంత స్కిల్ కూడా ఉండాలి. కెరీర్ ఆరంభంలో మంచి విజయాలు అందుకున్న హీరోయిన్లు కొందరు ఆ తర్వాత బ్యాడ్ స్క్రిప్టులు ఎంచుకుని చాలా మంది తమ కెరీర్‌ను పాడు చేసుకున్నారు. వీరిలో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..అనిత హస్సానందిని ఉదయ్ కిరణ్‌కు జోడిగా ‘నువ్వు నేను’ సినిమాలో చేసింది. ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఆమె శ్రీరామ్, తొట్టిగ్యాంగ్ లాంటి పసలేని కథలు చేసి క్రమంగా ఇండస్ట్రీకి దూరమైంది.
బాలీవుడ్ నటి నేహా శర్మ ‘చిరుత’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కుర్రాడు వంటి సోసో స్టోరీలను ఎంచుకుని తను కూడా కనుమరుగైంది. హీరోయిన్ రక్షిత ‘ఇడియట్’ మూవీతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నిజం, ఆంధ్రావాలా పసలేని కథలను ఎంచుకుని తన కెరీర్‌ను పాడు చేసుకుంది. మధ్యలో శివమణి చిత్రంలో నటించినా అందులో ఆమె కంటే ఆసిన్‌కు మంచి పేరు వచ్చింది.నటి ఇషా చావ్లా ‘ప్రేమ కావాలి’సినిమాతో తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు చేసిన మూవీస్ అన్ని డిజాస్టర్ అయ్యాయి. నటి కార్తీక తెలుగులో నాగ చైతన్యకు జోడిగా ‘జోష్’మూవీలో కనిపించింది. తమిళంలో ‘రంగం’చిత్రం మాత్రం అ బ్యూటీకి మంచి హిట్ ఇచ్చింది.
tollywood heroines who have ruined their careers
సీనియర్ నటి రాధ కూతురు కార్తీకకు ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ పరువలేకపోయింది. అను ఇమ్మాన్యుయేల్ నేచురల్ స్టార్ నానికి జోడిగా ‘మజ్ను’చిత్రంతో నటించి మంచి సక్సెస్ ను అందుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆమెకు పెద్దగా పేరును తీసుకు రాలేకపోయాయి. యంగ్ హీరోయిన్ నందిత రాజ్ ‘ప్రేమ కథా చిత్రం’ చిత్రంలో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పెద్దగా సినిమా ఆఫర్లు రాలేదు. బో… బ్యూటీ హెబ్బా పటేల్ ‘కుమారి 21 ఎఫ్’చిత్రంతో సూపర్ విక్టరీ అందుకున్నా తర్వాత సినిమాలు బోల్తా కొట్టాయి. కృతి శెట్టి ‘ఉప్పెన’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నా.. ‘శ్యామ్ సింగ రాయ్’లో మాత్రం లిమిటెడ్ రోల్. క్రెడిట్ మొత్తం సాయి పల్లవికి వెళ్లిపోయింది. బంగార్రాజు మూవీ హిట్ టాక్ తెచ్చుకున్నా పెద్దగా రాలేదు.
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
This website uses cookies.