Home » Exclusive » 2022 May 4 Today Gold Rates In Telugu States
Exclusive

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం ధరలు.. తగ్గిన వెండి.. ఎంతో తెలుసా?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: May 4, 2022, 9:00 am
Advertisement

Today Gold Rates : గత మూడు నాలుగు రోజుల నుంచి బంగారం ధర వరుసగా తగ్గుకుంటూ వచ్చింది. నిన్న అక్షయ తృతియ రోజు కూడా బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో అక్షయ తృతియ రోజు బంగారం కొనుగోళ్లు దేశవ్యాప్తంగా పెరిగాయి. తాజాగా ఈరోజు అంటే మే 4న బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కాకపోతే వెండి ధరలు మాత్రం తగ్గాయి. నిజానికి.. ఒకప్పుడు బంగారం కొనడానికి ఎవ్వరూ పెద్దగా వెనుకాడేవారు కాదు కానీ.. ఈరోజుల్లో బంగారం కొనాలంటే మాత్రం చాలా కష్టం. బంగారం పేరు ఎత్తితే చాలు భయపడుతున్నారు. పెళ్లిళ్లకు ఇతర శుభకార్యాలకు ఈరోజుల్లో బంగారం కొనడం అనేది గగనంగా మారింది. తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైనే వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది.

Advertisement

2022 april 23 today gold rates in telugu states

ఇక.. దేశ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూస్తే.. ఒక గ్రాము బంగారానికి 22 క్యారెట్లకు రూ.4720గా ఉంది. నిన్నటి ధర కూడా అంతే. 10 గ్రాముల బంగారానికి 22 క్యారెట్లకు రూ.47,200గా ఉంది. 24 క్యారెట్ల బంగారానికి ఒక గ్రాముకు రూ.5151 గా ఉంది. నిన్నటి ధర కూడా రూ.5151గా ఉంది. ఇక.. 10 గ్రాముల బంగారానికి 24 క్యారెట్లకు రూ.51,510 గా ఉంది.

Advertisement

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారానికి 10 గ్రాములకు రూ.47,200గా ఉంది. 24 క్యారెట్లకు రూ.51,510గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.48,160 గా ఉండగా… 24 క్యారెట్లకు రూ.52,540గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.47,200గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.51,510గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.47,200గా ఉండగా 24 క్యారెట్లకు రూ.51,510గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.47,200 గా ఉండగా.. 24 క్యారెట్లకు 51,510గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.47,200 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,510 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.47,200 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,510 గా ఉంది. విశాఖపట్టణంలో కూడా అదే ధర ఉంది.

Advertisement

ఇక వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాముకు ఇవాళ వెండి ధర రూ.62.30గా ఉంది. అంటే 40 పైసలు తగ్గింది. నిన్న ఒక గ్రాము వెండి ధర రూ.62.70 గా ఉండేది. 10 గ్రాములకు ఇవాళ వెండి ధర రూ.623 గా ఉంది. నిన్నట ధరతో పోల్చితే రూ.4 తగ్గింది. కిలో బంగారంపై రూ.400 తగ్గింది. ఇవాళ కిలో బంగారం ధర రూ.62,300గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు చూసుకుంటే.. హైదరాబాద్ లో 10 గ్రాములకు రూ.670 కాగా కిలో వెండి ధర రూ.67000గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి