Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారం కొనడం గగనంగా మారిపోయింది. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బంగారం కొనాలంటే లక్షలు పోయాల్సి వస్తోంది. ఒకప్పుడు బంగారం అంటే పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. అందుకే తక్కువ ధరకే బంగారం లభించేది. కానీ.. నేడు బంగారానికి విపరీతంగా డిమాండ్ పెరగడంతో.. ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు కూడా బంగారం పెరుగుదలకు ఒక కారణం. ప్రస్తుతం ఒక తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైనే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

2022 april 12th today gold rates in telugu states
భారత్ లో ఒక గ్రాము బంగారానికి 22 క్యారెట్లకు రూ.4740గా ఉంది. నిన్న ఒక గ్రాము బంగారానికి రూ.4700 ఉండగా.. ధర 40 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్లకు 10 గ్రాములకు రూ.47,400గా ఉంది. నిన్న రూ.47 వేలుగా ఉండేది. అంటే ఇవాళ రూ.400 పెరిగిందన్నమాట.
ఇక.. 24 క్యారెట్ల బంగారాన్ని తీసుకుంటే.. ఒక గ్రాముకు ఇవాళ దాని ధర రూ.5170గా ఉంది. నిన్న రూ.5128గా ఉంది. రూ.42 పెరిగింది. 10 గ్రాములకు ఇవాళ రూ.51,700 గా ఉంది. నిన్న రూ.51,280గా ఉంది. అంటే.. 10 గ్రాముల మీద రూ.420 పెరిగింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు చూసుకుంటే.. 22 క్యారెట్లకు రూ.47,000, 24 క్యారెట్లకు రూ.51,700 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.48,510, 24 క్యారెట్లకు రూ.52,920 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.47,400, 24 క్యారెట్లకు రూ.51,700గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.47,400, 24 క్యారెట్లకు రూ.51,700గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.47,400గా, 24 క్యారెట్లకు రూ.51,700గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.47,400, 24 క్యారెట్లకు రూ.51,700గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.47,400గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.51,700గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.47,400 ఉండగా.. 24 క్యారెట్లకు రూ.51,700గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. వెండి ఒక గ్రాముకు రూ.63.80గా ఉంది. నిన్న రూ.62.70 గా ఉండేది. అంటే ఇవాళ ఒక గ్రాము మీద రూ.1.10 పైసలు పెరిగింది. 10 గ్రాములకు రూ.638 కాగా.. నిన్న రూ.627గా ఉండేది. 10 గ్రాములకు రూ.11 పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 10 గ్రాములకు రూ.677, కిలోకు రూ.67700గా ఉండేది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.