#image_title
AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు, కృత్రిమ మేధస్సు (AI) సాంకేతిక పరిజ్ఞానాల విస్తరణ కారణంగా అనేక కంపెనీలు భారీగా ఉద్యోగాలను కోత చేస్తున్నారు. ఈ పరిణామంలో ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ తాజాగా మరోసారి ఉద్యోగాల తొలగింపులకు దిగింది. తాజా సమాచారం ప్రకారం, అమెరికా, భారతదేశం, ఫిలిప్పీన్స్, కెనడా, యూరప్ వంటి అనేక దేశాలలో 3 వేల మందికి పైగా ఉద్యోగులను కంపెనీ తొలగించింది. ముఖ్యంగా ఒరాకిల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (OCI), హెల్త్ విభాగం, నెట్‌సూట్ గ్లోబల్ యూనిట్లు, ఇతర కార్పొరేట్ విభాగాల ఉద్యోగులు ఈ కోతల ప్రభావానికి గురయ్యారు.
AI Effect
ఈ తొలగింపులు కంపెనీ వ్యాపార ప్రాధాన్యతల్లో మార్పులకు సంకేతమని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. 2022లో సెర్నర్‌ను కొనుగోలు చేసి హెల్త్ ఐటీ రంగాన్ని విస్తరించిన ఒరాకిల్, ఇప్పుడు ఆ విభాగంలోనే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడం గమనార్హం. అమెరికాలో వాషింగ్టన్ రాష్ట్రం, సియాటిల్‌లో వందలాది ఉద్యోగాలు పోయాయి. భారతదేశంలో టెక్నాలజీ, సపోర్ట్ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపై కోతలు అమలు చేయబడ్డాయి. ఫిలిప్పీన్స్‌లో కూడా కొన్ని బృందాలను పూర్తిగా తొలగించారు. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ తొలగింపులు కంపెనీ వ్యూహాత్మక మార్పుల దిశగా సాగుతున్నాయని స్పష్టమవుతోంది.
ఒరాకిల్ మాత్రమే కాకుండా, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. Layoffs.fyi నివేదికల ప్రకారం ఈ ఏడాదిలోనే 83 వేల మందికి పైగా టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. కొత్తగా ఉన్న ఎంట్రీ లెవల్, మిడ్ లెవల్ ఉద్యోగులు ఎక్కువగా ప్రమాదంలో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. కారణం – AI ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో మానవ ఆధారిత పనుల అవసరం తగ్గిపోవడం. దీంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం, పోటీలో నిలవడం కోసం ఉద్యోగ కోతలను తప్పనిసరిగా అమలు చేస్తున్నాయి. ఈ పరిణామం టెక్ రంగంలో భవిష్యత్తు ఉద్యోగావకాశాలపై పెద్ద ప్రశ్నార్థకాన్ని సృష్టిస్తోంది.
KTR Responds to Kavitha issue for the first time : బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ తన…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభ్యున్నతికి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై వ్యవసాయ…
సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…
Mobile Offer | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్‌తో మార్కెట్‌ను ఊపేస్తోంది. అత్యాధునిక…
Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే…
Melbourne Airport | ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ కు ఆస్ట్రేలియాలోని ఎయిర్‌పోర్ట్‌లో ఊహించని అనుభవం ఎదురైంది. ఓనం…
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మునుపెన్నడు లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామనర్స్, సెలబ్రెటీలను బిగ్‌బాస్…
This website uses cookies.