Home » News » Couple Caught Kissing In Public On A Train While Everyone Is Watching
News

Romance : పబ్లిక్ గా ట్రైన్ లో అందరు చూస్తుండగా ముద్దుల్లో తేలిన జంట

Authored By
Sudheer Ramanujam
The Telugu News | Published on: September 8, 2025, 6:00 pm
Advertisement

సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా ఉంటారు. అయితే ఇటీవల ఒక యువ జంట రైలులో చేసిన పనులు చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ ప్రయాణికులు ఉన్నప్పటికీ, ఆ జంట ఎలాంటి అదుపు లేకుండా బహిరంగంగానే రొమాన్స్‌లో మునిగిపోయింది. తమను ఎవరో వీడియో తీస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా వారు ప్రవర్తించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Advertisement

Couple caught kissing in public on a train while everyone is watching

యువత రానురాను మరీ బరితెగిస్తున్నారని, రీల్స్, సోషల్ మీడియా ప్రభావంతో ఏమి చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తిస్తున్నారని ఈ సంఘటన రుజువు చేస్తోంది. తోటి ప్రయాణికులు తమను ఎలా చూస్తారని కూడా ఆలోచించకుండా ఆ జంట ప్రవర్తించింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. “రైలును ఓయో రూమ్ చేశారంటూ” మరియు “ఓయో ట్రైన్” అంటూ కామెంట్లు పెడుతూ మండిపడుతున్నారు.

Advertisement

ఇలాంటి ఘటనలు రైలులో ప్రయాణించే కుటుంబాలకు ఇబ్బందికరంగా మారతాయి. రైలులో బహిరంగంగా ఇలాంటి పనులకు పాల్పడిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలలో అందరూ ప్రయాణిస్తున్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన గుర్తుచేస్తుంది.

Sudheer Ramanujam

Author Bio Info : Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి