Rahul John | 16 ఏళ్ల వయసులో స్టార్టప్ సీఈవో… తండ్రికి ఉద్యోగం ఇచ్చిన టెక్ విజేత రాహుల్!
Rahul John | కుర్రకారికి సాధారణంగా చదువు, కెరీర్ గురించే ఆలోచనలు ఉంటాయి. కానీ కేరళకు చెందిన రాహుల్ జాన్ అజు అనే 16 ఏళ్ల కుర్రాడు మాత్రం తన ఆలోచనలతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయ్యాడు. ఏఐ రంగంలో సొంత కంపెనీ స్థాపించి, తన తండ్రికే ఉద్యోగం ఇచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.

#image_title
‘ఆర్మ్ టెక్నాలజీస్’ సీఈవోగా రాహుల్
బహుశా దేశంలోనే అత్యంత చిన్న వయసులో సీఈవోగా వ్యవహరిస్తున్న యువకుడిగా రాహుల్ పేరు సుస్పష్టం అవుతోంది. ‘ఆర్మ్ టెక్నాలజీస్’ అనే తన స్వంత స్టార్టప్‌ను స్థాపించి, ఇప్పటికే 10కు పైగా ఏఐ టూల్స్‌ను అభివృద్ధి చేశాడు. ఆరేళ్ల వయసులోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఆసక్తి పెంచుకున్న రాహుల్, ఇప్పుడు ‘మీ-బోట్’ అనే రోబోను సైతం రూపొందించి టెక్ వర్గాలను ఆకట్టుకున్నాడు.
తన తండ్రిని ఉద్యోగంలోకి తీసుకోవడం ఒక సాధారణ నిర్ణయం కాదని రాహుల్ చెబుతున్నాడు. ‘‘ఇది నమ్మకానికి ప్రతీక. కుటుంబమే కాదు, ఆవిష్కరణల్లో కూడా భాగస్వామ్యం అవసరం’’ అంటూ చెప్పిన రాహుల్, యువతకు సమిష్టి దృష్టితో ముందుకు సాగాలని సందేశం ఇచ్చాడు. భారతదేశం ఇతరుల టెక్నాలజీ రేసులో పరుగులు పెట్టకూడదు. మన దేశం సొంతంగా కొత్త రేసును ప్రారంభించాలి,” అని స్పష్టం చేశాడు.